శనివారం 04 జూలై 2020
Cinema - Jul 01, 2020 , 10:13:28

బిగ్ బాస్ సీజ‌న్4 కంటెస్టెంట్స్ వీరేనా ?

బిగ్ బాస్ సీజ‌న్4 కంటెస్టెంట్స్ వీరేనా ?

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి పసందైన వినోదాన్ని అందిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ప్రాంతీయ భాష‌ల‌లో సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న ఈ కార్యక్ర‌మం తెలుగులో మూడు సీజ‌న్స్ పూర్తి చేసుకుంది. మ‌రి కొద్ది రోజుల‌లో నాలుగో సీజ‌న్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో నాలుగో సీజ‌న్‌కి హోస్ట్ ఎవ‌రు, కంటెస్టెంట్స్‌గా ఎవ‌రెవ‌రిని ఎంపిక చేయ‌బోతున్నార‌నే విష‌యాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. ఇందులో భాగంగా ప‌లువురి పేర్లు కూడా బ‌య‌ట‌కి వ‌స్తున్నాయి.

 ప్రేక్షకులు ఇచ్చే ఓటింగ్ ఆధారంగా విజేతను నిర్ణయించే  బిగ్ బాస్ షో  మొదటి సీజన్ లో హీరో శివబాలాజీ విన్నర్ గా నిలిచారు. సీజన్ 2లో యాక్టర్ కౌశల్ మండా మరియు సీజన్ 3లలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ టైటిల్ గెలుపొందారు. నాలుగో సీజ‌న్ కోసం ఎవ‌రు పోటి ప‌డ‌తార‌నేది ఆస‌క్తికరంగా మారంది. అయితే సీజ‌న్ 4లో  హీరో నందు ,యాంకర్ ఝాన్సీ , సింగర్ సునీత , కమెడియన్ తాగుబోతు రమేష్ , బిత్తిరి సత్తి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ముంబై హాట్ గాళ్ శ్రద్ధా దాస్, తెలుగమ్మాయి యామిని భాస్కర్.. టాప్ మోడల్ కం నటి హంసా నందిని..  మరో తెలుగమ్మాయి ప్రియా వడ్లమాని.. మోనా అనే మరో నటి కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేస్తార‌ని తెలుస్తుంది. 

సీజ‌న్ 3ని స‌క్సెస్‌ఫుల్‌గా న‌డిపించి బుల్లితెరపై  అత్యధిక టీఆర్పీ సాధించిన రియాలిటీ షో గా నిలిపిన కింగ్ నాగ్ 4వ సీజన్ కి కూడా   హోస్ట్ గా వ్యవహరించనున్నారని సమాచారం. ఆగస్ట్ నుండి 'బిగ్ బాస్ - 4' కార్యక్రమం స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. గ‌తంలో వంద రోజుల‌కి పైగా సాగిన ఈ షో ఇప్పుడు మాత్రం త‌క్కువ రోజులే ఉంటుంద‌ని వినికిడి.


logo