ఆరు నూరైనా బిగ్ బాస్ 5 తెలుగు అనుకున్న సమయానికి మొదలు పెట్టాలని పట్టుదలతో ఉన్నారు నిర్వాహకులు. గతేడాది ఆలస్యం అయినా కూడా ఈ సారి మాత్రం అలాంటివేం జరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. సెకండ్ వేవ్ ఇంత దారుణంగా ఉన్నా కూడా.. జూమ్ యాప్ నుంచి కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసి వీలైనంత త్వరగా షో మొదలు పెట్టాలని చూస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే చాలా మంది కంటెస్టెంట్స్ ను ఇప్పటికే ఎంపిక చేసారని ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఈ కంటెస్టెంట్ లిస్ట్ గురించి చర్చ కూడా జరుగుతుంది. ఈ సారి ఇంట్లోకి వెళ్లబోయేది వీళ్లే అంటూ 10 మందితో ఉన్న లిస్టు కూడా బాగానే హల్ చల్ చేస్తుంది. అందులో హైపర్ ఆది, శేఖర్ మాస్టర్ సహా షణ్ముఖ్ జస్వంత్ లాంటి పెద్ద పేర్లు కూడా ఉన్నాయి.
ఇది కేవలం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పేర్లు మాత్రమే. అధికారికంగా ఎవరి పేరు కూడా బిగ్ బాస్ టీమ్ కన్ఫర్మ్ చేయలేదు. అయితే దుర్గా రావు, షణ్ముఖ్ మాత్రం తమకు బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. మిగిలిన వాళ్ల పేర్లు ప్రచారంలో ఉన్నాయంతే. జులై నుంచి సీజన్ 5 మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారు నిర్వాహకులు. ఈ సారి కూడా నాగార్జున హోస్ట్‌గా ఉండబోతున్నాడు.