ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమోను విడుదల చేశారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే బిగ్ బాస్ 5 లోగోను విడుదల చేసిన బిగ్ బాస్ యాజమాన్యం.. తాజాగా హోస్ట్ నాగార్జున ఉన్న ప్రోమోను రిలీజ్ చేశారు. అంటే.. ఈసారి కూడా హోస్ట్‌గా నాగార్జుననే కన్ఫమ్ చేశారన్నమాట.
బోర్‌డమ్‌కు చెప్పేయ్ గుడ్‌బై.. వచ్చేసింది బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 అంటూ.. నాగార్జున అందరితో చిందులేస్తూ చెప్పే మాటలు తెలుగు ప్రేక్షకులకు హుషారును తెప్పిస్తారు. తాజాగా రిలీజైన ప్రోమోలో షో ప్రారంభ తేదీని మాత్రం వెల్లడించలేదు.