మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 02, 2020 , 15:58:45

బిగ్ బాస్ హౌజ్‌లో ఫ్యాష‌న్ షో.. అద్దంగా మారిన అవినాష్‌

బిగ్ బాస్ హౌజ్‌లో ఫ్యాష‌న్ షో.. అద్దంగా మారిన అవినాష్‌

కిల్ల‌ర్ టాస్క్‌తో ఇటు హౌజ్‌మేట్స్‌ని, అటు ప్రేక్ష‌కుల‌ని టెన్ష‌న్ పెట్టిన బిగ్ బాస్ ఈ రోజు ఫ్యాష‌న్‌తో ప్రేక్ష‌కుల‌కు క‌నుల విందు చేయ‌నున్నారు. నేటి ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో ఫ్యాష‌న్ షో కు సంబంధించిన విజువ‌ల్స్ చూపించారు. ఇక ఈ ఫ్యాష‌న్ షోలో అందాల ముద్దుగుమ్మ‌లు అదిరిపోయే డ్రెస్‌లు ధ‌రించి ర్యాంప్ వాక్ చేయ‌గా, అబ్బాయిలు ట్రెండీ లుక్‌లో ర‌చ్చ చేశారు. 

అదిరిపోయే పంచ్‌ల‌తో అవినాష్ కూడా ర‌చ్చ చేసిన‌ట్టు ప్రోమోని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. అవినాష్ ఇంట్లోని ఆడ‌వాళ్లంద‌రికి అద్దంగా మార‌గా, వారంద‌రు అవినాష్ ఎదురుగా కూర్చొని ఆయ‌న‌లో త‌మ‌ను చూసుకుంటూ ఉంటారు. అయితే అంద‌రు ఆడ‌వాళ్ళ‌పై సెటైర్స్ వేసిన అవినాష్‌కి గంగ‌వ్వ అదిరిపోయే పంచ్ ఇచ్చింది. నా ముక్కేంది ఇంత పెద్దగా క‌న‌బ‌డుతుంద‌ని గంగవ్వ అనే స‌రికి హౌజ్‌మేట్స్ అంతా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేసారు. ప్రోమోని బ‌ట్టి చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్ ఫుల్ ఫ‌న్‌గా ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. 


logo