మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 19:05:12

బిగ్ బాస్ 4.. 16 మంది కంటెస్టెంట్స్ తో సంద‌డే సంద‌డి

బిగ్ బాస్ 4.. 16 మంది కంటెస్టెంట్స్ తో సంద‌డే సంద‌డి

క‌రోనా టైంలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేక బోరింగ్‌గా ఫీల‌వుతున్న ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త వినోదాన్ని అందించేందుకు బుల్లితెర బిగ్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 మ‌న ముందుకు వ‌చ్చేసింది. క‌రోనా మ‌హ‌మ్మారి భ‌యాల మ‌ధ్య మొద‌లైన ఈ బిగ్ రియాలిటీ షోలో ఈ సారి అనేక మార్పులు జ‌రిగాయి. ఆడియ‌న్స్ లేకుండానే మొద‌లైన ఈ షోలో నాగార్జున తండ్రి పాత్ర కొత్త‌గా ఎంట‌ర్ అయింది. ఆయ‌న బిగ్ బాస్ హౌజ్ లోప‌లికి వెళ్లి అంతా ప‌రిశీలించారు.  

ముందు పోస్ట్ బాక్స్‌ని ప‌రిశీలించిన ఆయ‌న గార్డెన్ ఏరియా, స్విమ్మింగ్ పూల్, బాత్ రూంస్‌, మిర్ర‌ర్స్‌, గ‌త సీజ‌న్‌లో లేని కొత్త అడ్డా, లివింగ్ రూం, డైనింగ్ హాల్‌,కిచెన్, క‌న్ఫెష‌న్ రూం, అంద‌మైన బెడ్ రూం, స్పెష‌ల్ రూంల‌ని చూసి ఫిదా అయ్యారు. ఇక నాగార్జున తండ్రి పాత్ర‌ని ఇంటికి పంపిన హోస్ట్ నాగార్జున స్టార్ మా కొత్త లోగో రిలీజ్ చేశారు. ఇందులో తెలుగు ద‌నం ఉట్టిప‌డేలా ప‌సుపు, కుంకుమ రంగుల‌తో మా అనే తెలుగు అక్షరం ఉంద‌ని చెప్పారు. సరికొత్త లోగో ద్వారా బ్రాండ్‌ రిప్రెష్‌మెంట్‌ చేసింది స్టార్‌ ఇండియా యాజమాన్యం.

విదేశాలలో మొద‌లైన బిగ్ బాస్ కార్య‌క్ర‌మం మెల్లగా హిందీలోకి వ‌చ్చింది. అక్క‌డ స‌క్సెస్ సాధించ‌డంతో అన్ని  ప్రాంతీయ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చి సంద‌డి చేస్తుంది. తెలుగులో తొలిసారి 2017 జులై 16న  ఈ షో మొదలైంది. మొదటి సీజన్‌ లోనావాలా ప్రాంతంలో వేసిన సెట్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా ఈ కార్య‌క్ర‌మాన్ని  న‌డిపించారు. రెండో సీజ‌న్‌ని నాని హోస్ట్ చేయ‌గా, మూడో సీజ‌న్ నాగార్జున హోస్ట్ చేశారు. ఇప్పుడు నాలుగో సీజ‌న్‌కి కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రెండు, మూడు, నాలుగు సీజ‌న్స్  హైదరాబాద్‌ లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్‌లో జ‌రుగుతున్నాయి. 

ఎంట‌ర్‌టైన్‌మెంట్ లైక్ నెవ‌ర్ బెఫోర్ అంటూ మొద‌లైన బిగ్ బాస్ సీజ‌న్ 4లో మొద‌టి కంటెస్టెంట్‌గా  మోనాల్ గ‌జ్జ‌ర్ (బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాలి) ఎంట్రీ ఇచ్చారు

రెండో కంటెస్ట్‌గా  సూర్య కిర‌ణ్ ( ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు) ప్ర‌వేశించారు.  2002లో వచ్చిన సత్యం చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు.మూడో కంటెంస్టెంట్‌గా  ల‌క్ష్మీ ప్ర‌స‌న్న లాస్య ప్రియాంక‌ రెడ్డి అలియాస్ లాస్య ( యాంక‌ర్) బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తెలుగులో ప‌లు షోస్‌కి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించింది.నాలుగో కంటెస్టెంట్‌గా అభిజిత్ ఎంట్రీ ఇచ్చారు. లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్ సినిమాలో హీరోగా న‌టించారు.


ఇక ఐదో కంటెస్టెంట్‌గా జోర్దార్ సుజాత ఎంట్రీ ఇచ్చింది


ఆరో కంటెంస్టెంట్ మెహ‌బూబ్ దిల్ సే (సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ ) హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు

రాజ‌మండ్రిలో పుట్టి పెరిగిన దేవి నాగ‌వ‌ల్లి ఏడో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ ఇంట్లోకి ప్ర‌వేశించింది

దేత్త‌డి హారిక( యూట్యూబ్ స్టార్) ఎనిమిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది

తొమ్మ‌దో కంటెస్టెంట్‌గా టీవీ న‌టుడు స‌య్య‌ద్ సోయ‌ల్ రియాన్ బిగ్ బాస్ ఇంట్లోకి ప్ర‌వేశించారు.


అరియానా గ్లోరీ (యాంకర్‌, జెమిని కెవ్వు కామెడీ యాంకర్) ప‌దో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది

తొమ్మిది,ప‌ది కంటెస్టెంట్‌లుగా వ‌చ్చిన స‌య్య‌ద్‌, అరియానాలని స్పెష‌ల్ క్యాట‌గిరీతో సీక్రెట్ హౌజ్( నైబ‌ర్ హౌజ్‌)‌లోకి పంపారు నాగ్‌. వారు ఏం చేయాలో బిగ్ బాస్ సూచిస్తార‌ని పేర్కొన్నారు.

ప‌ద‌కొండో కంటెస్టెంట్‌గా వ‌చ్చిన‌ ద‌ర్శ‌కుడు అమ్మా రాజ‌శేఖ‌ర్ డైరెక్ట్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. త‌న తోటి కంటెస్టెంట్స్ అంద‌రిని ప‌రిచ‌యం చేసుకున్నాడు.

పన్నెండో కంటెస్టెంట్‌గా క‌రాటే క‌ళ్యాణి బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బ్లాక్ బెల్ట్ పొందిన క‌ళ్యాణి హ‌రిక‌థ‌లు చెప్ప‌డంలో చాలా ఫేమ‌స్. న‌టిగా కూడా చాలా ఫేమ‌స్


సింగర్, ర్యాప‌ర్,న‌టుడిగాను తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం అయిన నోయల్ ప‌ద‌మూడో కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి వెళ్లాడు.

ప‌ద్నాలుగో కంటెస్టెంట్‌గా వ‌చ్చిన‌ దివి వెబ్ సిరీస్, సినిమాల‌తో కొంత ఫేమ‌స్  ఇప్పుడు బిగ్ బాస్ షోతో మ‌రింత పాపుల‌ర్ కావాల‌ని భావిస్తుంది. 

ప‌దిహేనో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన  అఖిల్ స‌ర్త‌క్‌ టాప్ 2 పొజీష‌న్‌లో ఉండాల‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్నాడు.


బిగ్ బాస్ 4 సీజ‌న్ స్పెష‌ల్ హౌజ్ మేట్ గంగ‌వ్వ  ప‌ద‌హారో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తానికి 16 మంది కంటెస్టెంట్స్ తో 51 వారాలు సంద‌డిగా సాగ‌నున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం అంద‌రికి మ‌రింత వినోదాన్ని పంచుతుంద‌ని చెబుతూ నాగార్జున సైనింగ్ ఆఫ్ చేశారు.


బిగ్‌ బాస్‌ సీజన్‌ 4లోకి అడుగుపెట్టిన 16మంది కంటెస్టెంట్స్‌ వీరే:

1. మోనాల్‌ గజ్జర్‌ (నటి)

2. సూర్యకిరణ్‌ (దర్శకుడు) 

3. లాస్య (యాంకర్‌)

4. అభిజిత్‌ (నటుడు, లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ ఫేమ్‌)

5. జోర్దార్‌ సుజాత (టీవీ యాంకర్‌)

6. మెహబూబ్‌ దిల్‌ సే (యూట్యూబ్‌ డ్యాన్సర్‌)

7. దేవి నాగవల్లి (టీవీ 9 న్యూస్‌ రిపోర్టర్‌)

8. దేత్తడి హారిక (యూట్యూబ్‌ స్టార్‌)

9. సయ్యద్‌ సోహెల్‌ ర్యాన్‌ (టీవీ యాక్టర్‌)

10. ఆరియానా గ్లోరీ (యాంకర్‌)

11. అమ్మ రాజశేఖర్‌ (దర్శకుడు)

12. కరాటే కల్యాణీ (నటి)

13. నోయోల్‌

14. దీవి

15. అఖిల్ సార్థక్

16. గంగ‌వ్వ‌


logo