మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 17, 2020 , 15:48:36

బిగ్ బాస్ 4 తెలుగులో వ్యక్తిగత దూషణ మరీ ఎక్కువైపోతుందా..?

బిగ్ బాస్ 4 తెలుగులో వ్యక్తిగత దూషణ మరీ ఎక్కువైపోతుందా..?

ఏమో ఇప్పుడు షో చూస్తున్న ఆడియన్స్‌కు ఇలాంటి అనుమానాలు చాలానే వస్తున్నాయి. ఎందుకంటే ఈ సారి కంటెస్టెంట్స్ కూడా అలాగే ఉన్నారు మరి. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తున్నారు. అప్పుడప్పుడూ కంట్రోల్ తప్పిపోతున్నారు. కోపంలో వాళ్లేం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు. యిష్టమొచ్చినట్లు తిట్టుకుంటున్నారు.. కారెక్టర్ పైకి కూడా వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత దూషణ కూడా జరుగుతుంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. మొన్నటికి మొన్న నామినేషన్స్ టైమ్ లో అభిజీత్, అఖిల్ మధ్య జరిగిన పులి మేక వార్ అంత ఈజీగా ఎవరూ మరిచిపోలేరు. బుద్ది లేదని ఒకరంటే.. నీ దిమాక్ మోకాళ్లలో ఉందని మరొకరు అంటుంటే టాపిక్ ఎక్కడెక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత హారిక కూడా తక్కువేం తినలేదు. సోహైల్‌ను వేస్ట్ గాడు అనేసింది. దాన్ని మనోడు చాలా సీరియస్ చేసాడు. 

నువ్వు నన్నెట్లా వేస్ట్ గాడు అంటావ్ అంటూ రెచ్చిపోయాడు. మాట్లాడే పద్దతులు తెల్వదా నీకు అంటూ ఫైర్ అయ్యాడు. అక్కడితో ఆగాడా.. సోహైల్ కూడా హారికను టార్గెట్ చేసాడు. గింతంత లేవ్.. ఏం చూసుకునే నీకంత పొగరు.. ఛల్ ఛల్ అంటూ అనేసాడు. అంతకుముందు హారికను అవినాష్ కూడా పొట్టి అంటూ ఆట పట్టించాడు. అఖిల్ అయితే అప్పుడప్పుడూ పుర్తిగా కంట్రోల్ తప్పిపోయి మాట్లాడేస్తున్నాడు. తనకంటే చిన్నా పెద్దా అనే తేడా ఉండదు. కోపం వస్తే అంతే సంగతులు. సోహెల్ కూడా ఈయనకు తక్కువేం కాదు. ఎందుకంటే మనోడికి ఇంట్లో అర్జున్ రెడ్డి అని పేరుంది. కోపమొస్తే నరాలు అలా పైకి వచ్చేస్తుంటాయి. ఎదుట ఎవరున్నా కూడా ఫుట్ బాల్ ఆడుకుంటాడు. 

నీయవ్వ అంటూ మొదలు పెడతాడు. గత సీజన్స్ తో పోలిస్తే ఈ సారి కంటెస్టెంట్స్ కాస్త వెరైటీగానే ఉన్నారు. కలిసిపోవడం అలాగే కలిసిపోయారు.. తిట్టుకోవడం కూడా అలాగే చేస్తున్నారు. కొందరు అయితే మరీ మర్యాద లేకుండా రప్ఫాడించేస్తున్నారు. మనం ఉన్నది కెమెరా ముందు అనే విషయం కూడా మరిచిపోయి వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. వీకెండ్ లో వచ్చి అప్పుడప్పుడూ నాగార్జున కొరడా ఝులిపిస్తున్నా కూడా మనోళ్లు అయితే కంట్రోల్ కావడం లేదు. ఏదేమైనా కూడా ఈ పర్సనల్ అటాక్ అనేది అంతమంచిది కాదని.. అలా చేసినందుకే అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యాడని చెప్తున్నారు. మొత్తానికి చూడాలిక.. రాబోయే కొన్ని వారాలైనా ఈ పర్సనల్ అటాక్స్ లేకుండా ఎపిసోడ్స్ వస్తాయేమో..?


logo