బిగ్బాస్ టాలెంట్ మేనేజర్ దుర్మరణం

బిగ్ బాస్ షో తెలుగు కంటే ముందే హిందీలో మొదలైంది. ఇక్కడ మనం 4 సీజన్స్ మాత్రమే పూర్తి చేసుకున్నాం. అక్కడ ఇప్పుడు 14వ సీజన్ నడుస్తోంది. అంటే మనకంటే పదేళ్లు ముందున్నారు వాళ్లు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ షోకు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. అలాంటి షోలో ఇప్పుడు అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఈ షోకు కొన్నేళ్లుగా టాలెంట్ మేనేజర్ గా పని చేస్తున్న
పిస్తా ధాకడ్(24) వీకెండ్ ఎపిసోడ్ షూటింగ్ చేసుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. పిస్తా ధాకడ్ మృతితో ఒక్కసారిగా బిగ్ బాస్ నిర్వాహకుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం బిగ్బాస్ 14 సీజన్ జరుగుతోంది. షూటింగ్ పూర్తైన తర్వాత తన అసిస్టెంట్ తో కలిసి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా స్కిడ్ అయి కింద పడిపోయారు.
అయితే పడిన తర్వాత వాళ్లకేం కాలేదు కానీ సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న వ్యానిటీ వ్యాన్ వాళ్లపై నుంచి దూసుకెళ్లింది. దాంతో ఈ ప్రమాదంలో పిస్తా ధాకర్ అక్కడికక్కడే మృతి చెందగా.. అసిస్టెంట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఏదేమైనా కూడా చిన్న వయసులోనే ఇలా రోడ్డు ప్రమాదం పిస్తా ధాకడ్ ను మింగేయడంతో అంతా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈమె మరణంపై సినీ ప్రముఖులు, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్స్ సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కూడా ఈమె మరణంపై సంతాపం వ్యక్తం చేసాడు.
తాజావార్తలు
- వైరల్ వీడియో : పాట పాడుతున్న పులి
- అంతరిక్షంలో హోటల్.. 2027లో ప్రారంభం
- బెంగాల్ పోరు : లెఫ్ట్, ఐఎస్ఎఫ్తో కూటమిని సమర్ధించిన కాంగ్రెస్
- కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గదు: ప్రపంచ ఆరోగ్యసంస్థ
- కిడ్నాప్ అయిన 317 మంది బాలికలు రిలీజ్
- పవన్ నాలుగో భార్యగా ఉంటాను : జూనియర్ సమంత
- ఇన్సూరెన్స్ సంస్థలకు ఐఆర్డీఏ న్యూ గైడ్లైన్స్
- పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించే యోచనలో ఆర్థిక శాఖ
- ప్రపంచ కుబేరుల జాబితా : రూ 6.09 లక్షల కోట్లతో 8వ స్ధానంలో ముఖేష్ అంబానీ!
- ఆజాద్ దిష్టిబొమ్మ దగ్దం చేసిన కాంగ్రెస్ వర్కర్లు