మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jul 08, 2020 , 11:01:45

ప్ర‌భాస్ 20వ మూవీకి సంబంధించి బిగ్ అనౌన్స్‌మెంట్

ప్ర‌భాస్ 20వ మూవీకి సంబంధించి బిగ్ అనౌన్స్‌మెంట్

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌. ఎన్నో రోజుల నుండి ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి చిత్ర‌బృందం శుభ‌వార్త అందించింది. ప్ర‌భాస్ 20వ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్, టైటిల్ జూలై 10న ఉద‌యం 10 గంట‌ల‌కి రివీల్ చేయ‌నున్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా తెలిపింది. దీంతో ప్ర‌భాస్ హైహార్డ్ ఫ్యాన్స్ జూలై 10 ఎప్పుడు వ‌స్తుందా అని ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

ప్ర‌భాస్ 20వ చిత్రం జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తైంది. పూజా హెగ్డే ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఏక్తా టైగర్, ధూమ్-౩, బజరంగీభాయ్ జాన్, సుల్తాన్, టైగర్ జిందా హై, సైరా వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు మ్యూజిక్ కంపోజ్ చేసిన జూలియస్ పఖియమ్ ఈ చిత్రానికి సంగీతస్వరాలు అందిస్తున్నారట. ఈ సినిమాకి రాధే శ్యామ్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది. 1960 ల కాలం నాటి సెన్సిబుల్ లవ్ స్టోరీగా తెరక్కుతున్న చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. తెలుగు,త‌మిళం,మ‌ల‌యాళం, హిందీ భాష‌ల‌లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo