ఆదివారం 29 నవంబర్ 2020
Cinema - Nov 22, 2020 , 20:21:06

చీర కట్టుకున్న అవినాష్..నాగార్జున చివాట్లు

చీర కట్టుకున్న అవినాష్..నాగార్జున చివాట్లు

బిగ్ బాస్ 4 తెలుగు వీకండ్ ప్రోమో చూసిన తర్వాత ఇదే అంటారంతా. సన్ డే ఫన్ డే అంటూ అవినాష్ తో ఆడుకున్నాడు నాగార్జున. ఎపిసోడ్ అంతా రచ్చ చేస్తూనే ఉన్నాడు అవినాష్. మరీ ముఖ్యంగా ఎవర్ని ఏం అడిగినా కూడా ముందుగా అవినాష్ రియాక్ట్ అయ్యాడు. ప్రతీసారి ముందుకొచ్చి రచ్చ చేసాడు. దాంతో చిరాకు వచ్చిన నాగార్జున.. ఛీ నీ మొహం అంటూ చివాట్లు పెట్టాడు. ప్రోమో అంతా అవినాష్ కామెడీ తప్ప మరేం లేదు. బిగ్ బాస్ లో కూడా చిన్నసైజ్ జబర్దస్త్ కామెడీ షో నడిపిస్తున్నాడు అవినాష్. అందుకే సన్ డే ఎపిసోడ్ అంతా ఆయనే హైలైట్ కావాలని ఫిక్స్ అయ్యాడు. స్క్రీన్ ప్రజెన్స్ కోసం నాగార్జున ముందు రెచ్చిపోయాడు. పాటలు పాడుతూ డ్యాన్సులు చేసాడు. 

ఇదంతా చూసిన ఆడియన్స్ నవ్వుకున్నారు. ఇప్పుడు విడుదలైన కొత్త ప్రోమోలో అవినాష్ ఒక్కడితోనే ఎపిసోడ్ షూట్ చేసినట్లుంది. అఖిల్, సోహైల్ ప్రశ్నకు కూడా ఈయన దూరిపోయి సమాధానమిచ్చాడు. ఆ తర్వాత నాగార్జునతో చివాట్లు తిన్నాడు. ఆ తర్వాత లాస్య అప్పుడు కూడా ముందుకొచ్చాడు. ఓ టాస్కులో భాగంగా చీర కట్టుకున్నాడు అవినాష్. కట్టుకోవడమే కాకుండా డ్యాన్సులు చేసాడు. అంతటితో ఆగకుండా సోహైల్ నోటితో నెయిల్ పాలిష్ వేస్తుంటే వేయించుకున్నాడు. 

అవన్నీ చూసిన తర్వాత రాత్రి 9 తర్వాత ఇదే చేస్తున్నావా అవినాష్ రోజూ ఇంట్లో అంటూ కామెడీ చేసాడు. తన ఫన్ తో మిగిలిన వాళ్లను పూర్తిగా కనబడకుండా చేసాడు అవినాష్. గత రెండు వారాలుగా నామినేషన్స్ లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు అవినాష్. మరీ ముఖ్యంగా అందరితోనూ సరదాగా ఉంటున్నాడు. అన్నింటికీ మించి ఒక్కోవారం ఇంట్లో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నారు అంతా. గతవారం అరియానా అయినట్లు ఈ వారం అందరి కామన్ టార్గెట్ అభిజీత్ అయిపోయాడు. అవినాష్ మాత్రం సేఫ్ గేమ్ కు అలవాటు పడిపోయాడనే విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా సన్ డే కాస్తా ఫన్ అవినాష్ డే అయిపోయింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.