శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 04, 2020 , 14:46:53

ర‌వివ‌ర్మ క‌ళాఖండంలా భానుశ్రీ ఫొటోలు

ర‌వివ‌ర్మ క‌ళాఖండంలా భానుశ్రీ ఫొటోలు

బిగ్ బాస్ 2తో అంద‌రినీ అల‌రించింది అందాల బ్యూటీ భానుశ్రీ. ఈ భామ‌ బిగ్ బాస్ సీజన్ 2లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. తాజాగా భాను శ్రీ స‌రికొత్త లుక్ తో క‌నిపిస్తూ సంద‌డి చేస్తుంది. ర‌వివ‌ర్మ‌, ఎమ్ ఎఫ్ హుస్సేన్ చేతుల్లో నుంచి జాలువారిన అద్బుత‌మైన కళాఖండంలా భానుశ్రీ ఫొటోలు క‌నిపిస్తున్నాయి. హాఫ్ సారీ లుక్ లో ముక్కుపుడక‌, రింగుల్లాంటి చెవి క‌మ్మ‌లు, కాటుక కండ్ల‌తో కాస్త సిగ్గుప‌డుతున్న‌ట్టు దిగిన ఫొటోతోపాటు వివిధ ర‌కాల స్టైల్స్ లో దిగిన స్టిల్స్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 

టీవీలో అల‌రించిన భానుశ్రీ..2017లో ఇద్ద‌రి మధ్య 18 అనే చిత్రంతో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత కుమారి 21ఎఫ్, బాహుబ‌లి, కాట‌మ‌రాయుడు వంటి చిత్రాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది భానుశ్రీ. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo