మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 15, 2020 , 11:58:40

బిగ్‌బాస్‌ 4: రెండో వారం నామినేట్ అయింది వీళ్లే

బిగ్‌బాస్‌ 4: రెండో వారం నామినేట్ అయింది వీళ్లే

మొద‌టి వారం వీకెండ్ ఎపిసోడ్ లో సూర్య‌కిర‌ణ్ ఎలిమినేట్ అయి..కుమార్ సాయి వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక రెండోవారం (సోమ‌వారం)నామినేష‌న్ల‌ ప్ర‌క్రియ షురూ అయింది. దీని కోసం బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు ఓ టాస్క్ ఇచ్చాడు. ఇంట్లో ఉన్న 16 మంది గార్డెన్ ప్రాంతంలో ఉన్న ప‌డ‌వ‌లో ఎక్కాలి. ఆ ప‌డ‌వ ప్ర‌తీ తీరం మ‌ధ్య ఆగిన‌పుడు హార‌న్ మోగుతుంది. హార‌న్ వ‌చ్చిన ప్ర‌తీసారి ఒక్కో స‌భ్యుడు..ప‌డ‌వ‌లో నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. ఇలా ప‌డ‌వ 9 తీరాల మధ్య ఆగుతుంది. అంటే 9 మంది నామినేట్ అవుతార‌న్న‌మాట‌. దీంతో స‌భ్యులంతా ప‌డ‌వ‌లో కూర్చొని స‌ర‌దాగా ఆట‌పాట‌ల‌తో అంద‌రిలో జోష్ నింపారు.

అయితే మొద‌టి తీరం రాక‌ముందే స‌భ్యులు నేను దిగిపోతా అంటే నేను అంటూ ముందు కొచ్చారు. ప‌డ‌వ‌లో నుంచి దిగేందుకు కార‌ణం చెప్తే తాను దిగిపోతాన‌ని కుమార్ సాయి ఇంటిస‌భ్యుల‌తో చెప్పాడు. ప‌డ‌వ‌లో నుంచి ఎవ‌రిని దింపేయాలంటూ స‌భ్యులు చ‌ర్చ స్టార్ట‌యింది. గంగ‌వ్వ ఎక్కువ సేపు ప‌డ‌వ‌లో కూర్చోలేద‌ని చెప్తూ..మొద‌ట ప‌డ‌వ దిగ‌మ‌ని చెబుతామ‌ని స‌భ్యుల‌కు సూచించాడు. అభిజిత్ మాట‌ల‌కు స‌రేన‌న్న గంగవ్వ మొద‌టి రౌండ్ లోనే దిగిపోయింది. నోయ‌ల్ రెండో హార‌న్ కే ప‌డ‌వ దిగిపోగా..మోనాల్ గ‌జ్జ‌ర్ ప‌డ‌వ నుంచి దిగిపోయింది. నాలుగో రౌండ్ హార‌న్ రాగానే సోహైల్..ఐదో హార‌న్ కు క‌ళ్యాణి ప‌డ‌వ దిగింది. ఆరో రౌండ్ లో అమ్మ‌రాజశేఖ‌ర్, ఏడ‌వ హార‌న్ కు కుమార్ సాయి, ఎనిమిదో హారన్ కు హారిక‌, 9వ హార‌న్ కు అభిజిత్ ప‌డ‌వ‌లో నుంచి దిగిపోయాడు. 


అయితే సుజాత‌, దివి, మెహ‌బూబ్‌, అఖిల్ మాత్రం చివ‌రిదాక ప‌డ‌వ‌లోనే ఉండిపోయారు. ఇక గంగ‌వ్వ‌, మోనాల్‌, సోహైల్‌, క‌రాటే క‌ళ్యాణి, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, కుమార్ సాయి, అభిజిత్‌, హారిక, నోయ‌ల్ రెండో వారం నామినేట్ అయ్యారు. ఈ వారం బిగ్ బాస్ హౌజ్‌లో సేఫ్ అయ్యేదెవ‌రో, ఎలిమినేట్ అయ్యేదెవ‌రో తెలియాలంటే..రెండోవారమంతా సాగ‌నున్న ఎపిసోడ్స్ ను వీక్షించాల్సిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo