శనివారం 06 జూన్ 2020
Cinema - May 21, 2020 , 18:17:30

షెహ్నాజ్‌ గిల్‌ తండ్రిపై అత్యాచార ఆరోపణలు

షెహ్నాజ్‌ గిల్‌ తండ్రిపై అత్యాచార ఆరోపణలు

చండీగఢ్‌: బిగ్‌బాస్‌ 13 ఫైనలిస్ట్‌ షెహ్నాజ్‌ గిల్‌ ‌ తండ్రి సంతోక్‌ సింగ్‌ సుఖ్‌పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. సంతోక్‌సింగ్‌ తనపై గన్‌పాయింట్‌ పరిధిలో లైంగికవేధింపులకు పాల్పడ్డాడని పంజాబ్‌కు చెందిన ఓ మహిళ  పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమృత్‌సర్‌లోని బియాస్‌ సిటీలో సదరు మహిళ తన భాయ్‌ఫ్రెండ్‌ను కలవాల్సి ఉండగా..ఆమెను సంతోక్‌సింగ్‌ సుఖ్‌ తన కారులో తీసుకెళ్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అయితే తన తండ్రిపై వచ్చిన ఆరోపణలపై షెహ్నాజ్‌ గిల్‌ ‌ ఇంతవరకు స్పందించలేదు.

సంతోక్‌సింగ్‌ కుమారుడు షెహ్‌బాజ్‌ మాట్లాడుతూ..అవును పోలీస్‌స్టేషేన్‌లో నా తండ్రిపై మహిళ ఫిర్యాదు చేసింది. కానీ ఆమె చేసిన ఆరోపణలు ఏ మాత్రం నిజం లేదు. ఆ మహిళ అబద్దాలు అడుతుందడానికి తమ దగ్గర ఆధారాలున్నాయని, ఘటన జరిగిన ప్రాంతం సీసీ టీవీ పర్యవేక్షణలో ఉందని షెహ్‌బాజ్‌ తెలిపారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo