ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 03, 2020 , 18:18:41

సిద్దార్థ్ చెంప చెల్లుమ‌నిపించిన షెహ్ నాజ్..వీడియో

సిద్దార్థ్ చెంప చెల్లుమ‌నిపించిన షెహ్ నాజ్..వీడియో

ముంబై: షెహ్ నాజ్ గిల్-సిద్దార్థ్ శుక్లా..బిగ్ బాస్-13తో పాపుల‌ర్ క‌పుల్ గా వార్త‌ల్లో నిలిచారు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ఇద్ద‌రు తార‌లు అభిమానుల‌తో ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ సెష‌న్ లో పాల్గొన్నారు. సిద్‌నాజ్ కు ఉన్న అభిమానుల గురించి మాట్లాడారు. ద్వేషాన్ని వ్యాప్తి చేసే కొంత‌మందిని ప‌క్క‌న పెట్టాల‌ని ఫ్యాన్స్ తో చేసిన చాట్ లో సిద్దార్థ్ అన్నాడు. దీంతో ప‌క్క‌నే ఉన్న షెహ్ నాజ్ వెంట‌నే సిద్దార్థ్ చెంప చెల్లుమ‌నిపించింది. సీరియ‌స్ గా అనుకునేరు..ట్రోల్స్ పై మీరు కూడా ఇలానే చేయండి అంటూ షెహ్ నాజ్ ఇలా స‌ర‌దాగా త‌న ఫాలోవ‌ర్ల‌కు సూచించింది.

షెహ్‌నాజ్‌-సిద్ధార్థ్ ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని..త్వ‌ర‌లోనే వీళ్లు పెళ్లి బంధంతో ఒక్క‌ట‌వ్వ‌నున్నార‌ని ఇప్ప‌టికే చాలా కాలంగా వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. షెహ్ నాజ్ త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచినా..సిద్దార్థ్ మాత్రం తాము మంచి స్నేహితులం అంటూ చెప్పుకొస్తున్నాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo