గురువారం 21 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 09:10:01

అఖిల్,అభిజీత్‌ల మ‌ధ్య మ‌ళ్ళీ వార్.. ఈ సారి ఏ విష‌యంలోనో తెలుసా?

అఖిల్,అభిజీత్‌ల మ‌ధ్య మ‌ళ్ళీ వార్.. ఈ సారి ఏ విష‌యంలోనో తెలుసా?

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 కార్య‌క్ర‌మం మ‌రో మూడు వారాల‌లో ముగియ‌నుంది. ఎవ‌రు విన్న‌ర్, ఎవ‌రు ర‌న్న‌ర్ అనే దానిపై చాలా ఉత్కంఠ నెల‌కొంది. ఇంటి స‌భ్యులు కూడా ఇప్ప‌టి వ‌ర‌కు మెయింటైన్ చేసిన రిలేషన్స్ ప‌క్క‌న పెట్టి సీరియ‌స్‌గా గేమ్ ఆడుతున్నారు. అయితే హారిక మాత్రం అభిజీత్‌ని సేవ్ చేస్తూ త‌‌ప్పు చేసిన కూడా హెచ్చ‌రించ‌కుండా గేమ్ ఆడుతుంది. దీనిపై శ‌నివారం ఎపిసోడ్‌లో నాగ్ సీరియ‌స్ అయ్యారు 

ఇక ఎపిసోడ్ మొద‌ట్లో అభికి హెల్ప్ చేద్దామ‌ని అఖిల్ కిచెన్‌లోకి రావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. నువ్వు ఎందుకు చేస్తున్నావు అఖిల్ అని అభి అ‌డ‌గ‌గా, అందుకు స‌మాధానం ఇచ్చిన అఖిల్‌..నీకు సాయం చేద్దామ‌ని వ‌చ్చాను అని చెప్పాడు. బిగ్ బాంబ్ నాకు వేశారు క‌దా. నేను చేస్తాను , నీ సాయం నేను అడ‌గ‌లేదు క‌దా అంటూ అభి మండి ప‌డ్డాడు. ఇద్ద‌రి మ‌ధ్య కొద్ది సేపు వాద‌న జరిగిన త‌ర్వాత అఖిల్ బెడ్ రూంకి వెళ్ళి క‌న్నీరు పెట్టుకున్నాడు. అంద‌రిని ఒక‌లా న‌న్ను ఒక‌లా చూస్తున్నాడ‌ని భాధ‌ప‌డ్డాడు.


logo