శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 20, 2021 , 19:53:31

షారుక్ ఖాన్ ' ప‌ఠాన్' సెట్స్ లో గొడ‌వ జ‌రిగిందా..?

షారుక్ ఖాన్ ' ప‌ఠాన్'  సెట్స్ లో గొడ‌వ జ‌రిగిందా..?

ప్ర‌స్తుతం సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ష‌న్ లో ప‌ఠాన్ చిత్రం చేస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్. ముంబైలో షూటింగ్ కొన‌సాగుతుంది. అయితే ఇటీవ‌లే సిద్దార్థ్ ఆనంద్ త‌న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ తో గొడ‌వ ప‌డ‌టంతో షూటింగ్ నిలిచిపోయిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని, సెట్స్ లో అలాంటి ఫైట్ ఏం జ‌రుగ‌లేద‌ని బీటౌన్ వ‌ర్గాల నుంచి అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సిద్దార్థ్ ఆనంద్‌, ఓ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ కు మ‌ధ్య యుద్ధం జ‌రిగింద‌న్న వార్త‌లు నిరాధార‌మైన‌వి.

సిద్దార్థ్ త‌న టీంతో ఏండ్ల నుంచి మంచి అనుబంధాన్ని కొన‌సాగిస్తున్నాడు. టీం మెంబ‌ర్స్ అంతా సిద్ధార్థ్ ఆనంద్ ను త‌మ సోద‌రుడిగా భావిస్తారు. అస‌లు విష‌మేంటంటే..సెట్స్ లో ఓ లైట్‌మెన్ ప‌నిచేస్తుంటే గాయాల‌య్యాయి. అదృష్ట‌వ‌శాత్తు అత‌నికే కాలేదు. కానీ ఓ జూనియ‌ర్ ఆర్టిస్ట్ ఈ ఘ‌ట‌న‌ను స‌ర్క్యులేట్ చేసే ఉద్దేశంతో వీడియో తీశాడు. ఇది చాలా సున్నిత‌మైన విష‌య‌మ‌ని, వీడియో తీయొద్ద‌ని సిద్దార్థ్ స‌ద‌రు జూనియ‌ర్ ఆర్టిస్ట్ కు సూచించాడు. అయినా అత‌డు మాత్రం వీడియో తీస్తూనే ఉన్నాడు.

టీం లీడ‌ర్ గా డైరెక్ట‌ర్ సిద్దార్థ్ ఫోన్ ఇచ్చేసి సెట్స్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల‌ని జూనియ‌ర్ ఆర్టిస్ట్ ను హెచ్చ‌రించాడు. .జూనియ‌ర్ ఆగ్ర‌హంతో ఊగిపోతూ దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో సెక్యూరిటీ సిబ్బంది అత‌న్నిబ‌య‌ట‌కు పంపించేశార‌ని, సెట్స్ లో ఎవ‌రిని కొట్ట‌డం జ‌రుగలేద‌ని ప‌ఠాన్ టీం స‌న్నిహితుడొక‌రు చెప్పుకొచ్చిన‌ట్టు నేష‌న‌ల్ మీడియా త‌న క‌థనంలో పేర్కొంది. 

ఇవి కూడా చ‌ద‌వండి..

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది

రాశీఖ‌న్నాకు నో చెప్పిన గోపీచంద్‌..!

మాల్దీవుల్లో మెరిసిన సారా..ఫొటోలు వైర‌ల్‌

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

నన్ను ఫాలో కావొద్దు..రియాచ‌క్ర‌వ‌ర్తి వీడియో వైర‌ల్‌

చిరంజీవి న‌న్ను చాలా మెచ్చుకున్నారు..


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo