ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 06, 2020 , 09:28:05

అఖిల్‌, అభిజిత్ మ‌ధ్య‌లో మోనాల్‌.. బిగ్ ఫైట్‌

అఖిల్‌, అభిజిత్ మ‌ధ్య‌లో మోనాల్‌.. బిగ్ ఫైట్‌

బిగ్ బాస్ హౌజ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా ఉన్న ఇద్ద‌రు స‌భ్యులు అఖిల్‌, అభిజిత్‌ల మ‌ధ్య అనారోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంద‌ని మ‌రోసారి తేటతెల్ల‌మైంది. మొద‌టి నుండి ఇద్ద‌రి మ‌ధ్య  ప‌చ్చ‌గడ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలానే క‌నిపించింది. సోమ‌వారం జ‌రిగిన నామినేష‌న్ విష‌యంలో ఇది మ‌రోసారి తేలింది. అఖిల్‌.. అభిజిత్‌ను నామినేష‌న్ చేయడం, అభిజిత్‌తో క్లోజ్‌గా ఉండే హారిక‌.. అఖిల్‌, మోనాల్‌ల‌కు ఫోమ్ పూయ‌డం, ఆ త‌ర్వాత అభిజిత్‌.. అఖిల్‌ని నామినేట్ చేయడం, ఈ నామినేష‌న్ ప్ర‌క్రియ స‌మ‌యంలో అఖిల్‌, అభిజిత్‌, హారిక‌, మోనాల్ ల మ‌ధ్య వాగ్వాదాలు చోటుచేసుకోవ‌డంతో ఇంట్లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. 

ముందుగా అఖిల్‌, అభిజిత్ మ‌ధ్య ఒరేయ్ అన్న విష‌యంలో చ‌ర్చ రాగా, నీ ప‌ర్మీష‌న్ తీసుకొనే అరేయ్ అన్నా అని అఖిల్ చెప్పాడు. తీసుకోలేదు అని అభి అన్నాడు.  ఏజ్, ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఇప్ప‌టి వ‌ర‌కు  క్లారిఫికేషన్ ఇవ్వలేదు, దీనికి నేను చాలా హ‌ర్ట్ అయ్యాన‌ని అఖిల్ చెప్పుకొచ్చాడు.  ఇక అభి ఛాన్స్ వ‌చ్చిన‌ప్పుడు నువ్వు ప‌చ్చి అబద్ధం ఆడ‌తావ‌ని ఇప్పుడు అర్ద‌మైంది. క‌ళ్ళు ఇలా చేసి చూస్తే ఎవ‌డ‌న్నా భ‌య‌ప‌డ‌తారా ఇక్క‌డా, దేనికైన లిమిట్స్ ఉండాల‌ని అభిజిత్ అన‌డంతో.. అఖిల్ రెచ్చిపోయాడు. 

ఒక అమ్మాయి ఏదో సంద‌ర్భంలో ఐ లైక్ యూ అంటే దానిని రాత్రిళ్ళు అంద‌రికి చెప్పుకున్నావు. అలానే సుజాత గురించి కూడా బ్యాడ్‌గా మాట్లాడావు. ఒక అమ్మాయి గురించి నేష‌న‌ల్ ఛానెల్‌లో ఇలా బ్యాడ్‌గా మాట్లాడితే బ‌య‌ట‌కు ఎలా వెళుతుందో తెలియ‌దా అని అఖిల్ ఫైర్ అయ్యాడు. నేను నీ గురించి మాట్లాడుతుంటే మోనాల్, సుజాతల‌ను ఎందుకు ప‌ట్టుకొస్తున్నావ్ అంటూ అభి అన్నాడు.   

అఖిల్‌, అభిల మ‌ధ్య వాడివేడిగా న‌డుస్తున్న చ‌ర్చ‌లో మోనాల్ పేరు ప‌దే ప‌దే వ‌స్తుండ‌డంతో ఆమె తీవ్ర ఆగ్ర‌హానికి గురైంది.  నా పేరు ఎందుకు తెస్తున్నారు. నాకు ఇద్ద‌రు ఇష్ట‌మే, మీకెమ‌న్నా ప్రాబ్ల‌మ్స్ ఉంటే స‌ప‌రేట్ కూర్చొని తేల్చుకోండి. నేషనల్ ఛానల్‌లో నా క్యారెక్టర్‌ని బ్యాడ్ చేసి.. జీవితాలతో ఆడుకోవ‌ద్దు. క్యారెక్ట‌ర్‌తో అస్స‌లు ఆట‌లాడొద్దు అంటూ మోనాల్ గ‌ట్టిగా అరుస్తూ బోరున ఏడ్చింది. అమ్మా రాజ‌శేఖ‌ర్, గంగవ్వ ఆమెను ఓదార్చే ప్ర‌య‌త్నం చేశారు. సుజాత గురించి బ్యాడ్‌గా మాట్లాడార‌ని తెల‌సుకొని ఆమె ప‌క్క‌కు వెళ్లి చాలా ఫీలైంది. మొత్తానికి అఖిల్, అభిల మ‌ధ్య జ‌రిగిన వివాదం మ‌ధ్య‌లో మోనాల్ రావ‌డం, ఆమె క్యారెక్ట‌ర్‌ని జ‌డ్జ్ చేసేలా మాట్లాడ‌డం నెటిజ‌న్స్‌కు కూడా ఆగ్ర‌హాన్ని తెప్పించాయి. కాగా, ఐదోవారం నామినేషన్స్‌లో అఖిల్, నోయల్, అభిజిత్, సొహైల్, రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానా‌లు నిలిచారు.  


logo