మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 05, 2020 , 10:25:45

బిగ్ బాస్ 4 హౌస్ ఇదేనా ?

బిగ్ బాస్ 4 హౌస్ ఇదేనా ?

మ‌రికొద్ది రోజుల‌లో మొద‌లు కానున్న బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంకి సంబంధించి ప‌నుల‌న్నీ దాదాపు చివ‌రి ద‌శ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే అన్న‌పూర్ణ స్టూడియోలో సెట్‌ని సిద్దం చేయ‌గా, గ‌తంలో క‌న్నా మ‌రింత స్టైలిష్‌గా హౌస్‌ని రూపొందించిన‌ట్టు తెలుస్తుంది. తాజాగా బిగ్ బాస్ 4 ఇల్లు ఇదేనంటూ ఓ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ వీడియోలో బెడ్ రూం, గార్డెన్ ఏరియా, కిచెన్, స్విమ్మింగ్ పూల్, జైల్‌కి సంబంధించిన ఫోటోలు వీడియోలో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

16 మంది స‌భ్యుల‌తో 106 రోజుల పాటు బిగ్ బాస్ సీజ‌న్ 4 షో సాగ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ కార్య‌క్ర‌మాన్ని నాగార్జున హోస్ట్ చేయ‌నున్నారు. క‌రోనా కార‌ణంగా ఆయ‌న‌కి ప్ర‌త్యేక‌మైన ఏర్పాట్లు చేశారు. కేవ‌లం ఆదివారం మాత్ర‌మే నాగార్జున సంద‌డి చేస్తార‌ని, శ‌నివారం స‌మ‌యంలో వేరే సెల‌బ్రిటీల‌తో షో స‌ర‌దాగా సాగ‌నుంద‌ని టాక్. చూడాలి ఆగ‌స్ట్ నెలాఖ‌రులో మొద‌లు కానున్న బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్ష‌కుల‌కి ఏ రేంజ్ వినోదం అందిస్తుందో..


తాజావార్తలు


logo