మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jul 13, 2020 , 09:55:52

బిగ్ బీ నేను మీ కోసం ప్రార్థించను : వర్మ షాకింగ్ కామెంట్స్

బిగ్ బీ నేను మీ కోసం ప్రార్థించను : వర్మ షాకింగ్ కామెంట్స్

ముంబై : చాలా మంది సినీనటులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు కరోనా సోకిన విషయం విధితమే. అయనతో పాటుగా ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్, మనవరాలు ఆధ్య కూడా కరోనా సోకిందని, మిగిలిన కుటుంబ సభ్యులకు నెగటివ్ రిపోర్ట్‌ వచ్చిందని సమాచారం. బిగ్ బీ త్వరగా కోలుకోవాలి అభిమానులతో పాటుగా సెలబ్రిటీలు కోరుకుంటున్నారు. ఇప్పటికే మహేష్, చిరంజీవి లాంటి నటులు బిగ్‌ బీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాత్రం అమితాబ్ బచ్చన్ కోలుకోవాలని కోరుకోవడం లేదంటూ షాకింగ్ ట్వీట్ చేశారు. ‘మీరు కరోనా నుంచి కోలుకుంటారని నాకు తెలుసు.

ఎప్పటిలాగే మరింత బలంగా తిరిగి వస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అందుకే మీ కోసం నేను ప్రార్ధించను. కరోనా కారణంగా చనిపోతున్న వారి కోసం ప్రార్థిస్తాను’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. వర్మ ఇలాంటి వెరైటీ ట్వీట్‌ చేయడం పట్ల నెటిజన్లను ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక అమితాబ్‌తో వర్మ బాలీవు‌డ్‌లో సర్కార్ మూవీ సిరీస్‌లను తెరకెక్కించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo