e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News బిచ్చగాడు ప్రభంజనానికి ఐదేళ్లు

బిచ్చగాడు ప్రభంజనానికి ఐదేళ్లు

బిచ్చగాడు ప్రభంజనానికి ఐదేళ్లు

కొన్ని సినిమాలు విడుదలైనపుడు కనీసం ప్రేక్షకులు పట్టించుకోరు. వచ్చిన విషయం కూడా తెలియదు. అలాంటి ఓ సినిమా విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన బిచ్చగాడు. ఈ సినిమా విడుదలై 5 ఏళ్లు గడిచింది. 2016 మే 13న విడుదలైన బిచ్చగాడు సంచలన విజయం సాధించింది. సంచలనం అనేది కూడా చిన్న విషయమే అవుతుంది. 100 రోజుల సినిమాలు కనుమరుగు అవుతున్న ఈ సమయంలోనూ ఊరు పేరు లేకుండా వచ్చిన ఈ చిత్రం కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించింది. గతంలో వెంకటేష్ తో శీను సినిమా తెరకెక్కించిన శశి బిచ్చగాడు సినిమాను తెరకెక్కించాడు. మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ చిత్రం తమిళంలో యావరేజ్ గానే ఆడినా తెలుగులో మాత్రం చరిత్ర సృష్టించింది. విజయ్ ఆంటోనీకి తెలుగులో మార్కెట్ సంపాదించింది. ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఏంటో చూద్దాం..

నైజాం- 3.20 కోట్లు
సీడెడ్- 3.75 కోట్లు
ఉత్తరాంధ్ర- 2.25 కోట్లు
ఈస్ట్- 1.15 కోట్లు
వెస్ట్- 1.12 కోట్లు
గుంటూరు- 1.48 కోట్లు
కృష్ణా- 1.20 కోట్లు
నెల్లూరు- 0.65 కోట్లు

ఏపీ + తెలంగాణ (టోటల్)- 14.80 కోట్లు
బిచ్చగాడు ప్రభంజనానికి ఐదేళ్లు

బిచ్చగాడు సినిమా తెలుగు వర్షన్ కేవలం 2 కోట్ల లోపే అమ్మారు. విడుదలైనపుడు అవి కూడా వస్తాయా రావా అనే అనుమానాలు ఉండేవి. కానీ ఊహించని విధంగా 14.8 కోట్ల షేర్ వసూలు చేసింది. తద్వారా 12.6 కోట్ల లాభాలు అందించింది. బిచ్చగాడు సినిమాతో నిర్మాత చదలవాడ తిరుపతిరావు కోట్ల రూపాయల లాభాలు అందుకున్నాడు. 100 రోజుల వరకు కూడా రోజూ పేపర్ లో యాడ్ ఇవ్వడం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ లుక్.. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్..!

నాగార్జున‌తో పదోసారి జోడీ క‌డుతున్న అనుష్క‌

కోవిడ్ టీకా వేసుకున్న సూపర్ స్టార్ రజినికాంత్

అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ రోజే ఆచార్య వచ్చుండేది!

సల్మాన్ ఖాన్ రాధే సినిమాకు పైరసీ దెబ్బ

‘పుష్ప’ రెండు భాగాలు చేయడం వెనక పెద్ద క‌థే ఉంది..!

స‌ల్మాన్ దెబ్బ‌కు జీ5 యాప్ ఢ‌మాల్..!

త‌మిళియ‌న్‌ను పెండ్లి చేసుకుంటా: ర‌ష్మిక‌

అనుష్క న‌యా లుక్ నెట్టింట్లో చ‌క్క‌ర్లు..!

రోజా కూతురు అన్షు మాలిక ఫొటోలు వైర‌ల్‌

బాలీవుడ్ ఆఫర్‌కు నో చెప్పిన‌ సాయి పల్లవి

రాజశేఖర్‌తో గోపీచంద్ మ‌ల్టీస్టార‌ర్‌

డ‌బ్బు కోసం న‌న్ను దారుణంగా మోసం చేశారు : రేణు దేశాయ్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బిచ్చగాడు ప్రభంజనానికి ఐదేళ్లు

ట్రెండింగ్‌

Advertisement