శనివారం 05 డిసెంబర్ 2020
Cinema - Oct 20, 2020 , 00:04:48

భూమిక రక్షణ

భూమిక రక్షణ

కమర్షియల్‌ పంథాకు భిన్నంగా ప్రయోగాలకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తోంది కథానాయిక ఐశ్వర్యరాజేష్‌.  పాత్రల పరంగా ప్రతి సినిమాలో కొత్తదనాన్ని కనబరిచే ఆమె మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్ధమైంది.  ఐశ్వర్యరాజేష్‌ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘భూమిక’. రతీంద్రన్‌ ఆర్‌ ప్రసాద్‌ దర్శకుడు. కార్తిక్‌ సుబ్బరాజు సమర్పణలో   కార్తికేయన్‌ సంతానమ్‌, సుధాన్‌ సుందరమ్‌, జయరామన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోమవారం కథానాయిక తమన్నా ట్విట్టర్‌ ద్వారా విడుదలచేసింది. అరణ్యం మధ్యలో చెట్ల తీగలన్నీ ఐశ్వర్యరాజేష్‌ శరీరాన్ని పెనవేసుకొని ఉన్న ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆసక్తిని  రేకెత్తిస్తోంది. ఆమె కథానాయికగా నటిస్తోన్న 25వ చిత్రమిది. హారర్‌, థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతోంది. తెలుగు,తమిళ భాషల్లో విడుదలకానుంది. అటవీ ప్రాంతాల రక్షణ అంశాలకు వాణిజ్య హంగుల్ని జోడిస్తూ ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు తెలిసింది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని వెల్లడిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు.