మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన మూవీలకు సంబంధించి వరుస అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. శనివారం రోజు చిరంజీవి హీరోగా మోహన్ రాజా తెరకెక్కిస్తున్న లూసిఫర్ రీమేక్ టైటిల్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. గాఢ ఫాదర్ అనే టైటిల్ చిత్రానికి ఫిక్స్ చేసినట్టు పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఇక మెహర్ రమేష్ మూవీకి సంబంధించిన టైటిల్‌ని మహేష్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
వేదాళం రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భోళా శంకర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే చిరు మూవీ టైటిల్ రివీల్ చేస్తూ, ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ మంచి విజయాలు సాధించాలని మహేష్ ఆకాంక్షించారు. ఈ సినిమా క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.