టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi)తో దర్శకుడు మెహర్ రమేశ్ (Meher Ramesh ) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వేదాళమ్ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి భోళా శంకర్ (Bhola Shankar) టైటిల్ ను ఖరారు చేశారు. చిరంజీవి ప్రస్తుతం గాడ్‌ఫాదర్ (Godfather) చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాపై ఫోకస్ పెట్టాలని చిరు అనుకుంటున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మోహన్ రాజాతో చేస్తున్న గాడ్ ఫాదర్ ఊటీలో షూటింగ్ కొనసాగుతోంది.
ఈ షెడ్యూల్ తర్వాత చేయనున్న షూటింగ్ కోసం గాడ్‌ఫాదర్ బృందం ఇతర లొకేషన్ల వేటలో ఉందట. దీంతో ఊటీ షెడ్యూల్ తర్వాత షూటింగ్ కు బ్రేక్ పడనుంది. అయితే ఇదే సమంలో భోళా శంకర్ షూటింగ్ ను షురూ చేయాలని చిరంజీవిని మోహర్ రమేశ్ ఒప్పించినట్టుగా వార్తలు తెరపైకి వస్తున్నాయి. గాడ్‌ఫాదర్ లొకేషన్ల వేటాడే ఖాళీ సమయంలో చిరంజీవి భోళా శంకర్ ను సెట్స్ పైకి తీసుకెళ్తే మాత్రం అది ఇటు గాడ్‌ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజాకు, అటు బాబీకి ఊహించని సర్ప్రైజ్ అనే అంటున్నారు సినీ జనాలు.
భోళా శంకర్ చిత్రాన్ని మొదలుపెట్టే సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు మోహర్ రమేశ్. చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి సినిమాను తీసుకెళ్లాలా..? అని ఎక్జయిటింగ్ గా ఉన్నాడట. మరి చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. భోళాశంకర్ లో కీర్తిసురేశ్ చిరంజీవి సోదరి పాత్రలో నటిస్తోంది.
Samantha Cycling | వర్షంలో సమంత సైక్లింగ్..వీడియో వైరల్
KondaPolam trailer | నల్లమల అడవిలో శిక్షణ తీసుకున్నా..కొండపొలం ట్రైలర్