మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 06, 2020 , 21:49:28

ముంబైలో న‌టి అనుప‌మ పాఠ‌క్ ఆత్మ‌హ‌త్య‌‌

ముంబైలో న‌టి అనుప‌మ పాఠ‌క్ ఆత్మ‌హ‌త్య‌‌

ముంబై: బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణం అభిమానులని తీవ్ర విషాదంలోకి నెట్టివేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం మ‌రువ‌క ముందే ముంబైలో మ‌రో విషాద‌ఘ‌ట‌న వెలుగుచూసింది. బోజ్‌పురి న‌టి అనుప‌మ పాఠ‌క్ (40) ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.  ఆగ‌స్టు 2న ద‌హిసార్ లోని త‌న అపార్టుమెంట్ లో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు స్థానిక మీడియా వెల్ల‌డించింది.

ఆత్మ‌హ‌త్యకు ఒక రోజు ముందు అనుప‌మ పాఠ‌క్ ఫేస్ బుక్ లైవ్ లో కొన్ని విష‌యాలు షేర్ చేసుకుంది. అంతేకాదు రెండు కార‌ణాల వ‌ల్ల ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ తో మ‌ల‌ద్ లోని విస్డ‌మ్ ప్రొడ్యూస‌ర్ కంపెనీలో నేను రూ.10 వేలు పెట్టుబ‌డి పెట్టాను. నిబంధ‌న‌ల ప్ర‌కారం డిసెంబ‌ర్ 2019లో ఆ కంపెనీ రావాల్సిన డ‌బ్బును తిరిగివ్వాలి. కానీ ఇవ్వ‌కుండా కంపెనీ ఇబ్బంది పెడుతోంద‌ని రాసింది.  

మ‌రోవైపు మ‌నీశ్ ఝా అనే వ్య‌క్తి త‌న టూవీల‌ర్ వెహికిల్ లాక్ డౌన్ కొన‌సాగుతున్న‌పుడు మేలో తీసుకొని..ఇప్ప‌టివ‌ర‌కు తిరిగివ్వ‌డం లేద‌ని ఆరోపించింది.  ఎవ‌రినీ న‌మ్మ‌కూడ‌ద‌ని త‌న ఆవేద‌నను 10 నిమిషాల నిడివి గ‌ల వీడియోలో షేర్ చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo