ఆదివారం 07 జూన్ 2020
Cinema - Mar 08, 2020 , 07:33:53

భీష్మ నుండి తొలి డిలీటెడ్ సీన్ వీడియో

భీష్మ నుండి తొలి డిలీటెడ్ సీన్ వీడియో

నితిన్‌, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వెంకీ కుడుముల తెర‌కెక్కించిన చిత్రం భీష్మ‌. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. తొలి వారం ఫుల్ క‌లెక్ష‌న్స్‌తో దూసుకెళ్ళిన ఈ చిత్రం రెండో వారం కాస్త డ‌ల్ అయింది. క‌రోనా వ‌ల‌న ఎవ‌రు థియేట‌ర్స్‌కి వెళ్ళ‌క‌పోవ‌డంతో క‌లెక్ష‌న్స్ కాస్త త‌గ్గాయి. రెండు వారాల్లో 27 కోట్ల వరకు షేర్ రాబ‌ట్టింద‌ని స‌మాచారం. శ్రీనివాస కళ్యాణం డిజాస్టర్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని నితిన్ చేసిన ఈ సినిమా ఆయ‌న‌కి మంచి బూస్ట‌ప్ ఇచ్చింద‌నే చెప్ప‌వ‌చ్చు. రష్మిక గ్లామర్ షో.. నితిన్ పర్ఫార్మెన్స్.. వెన్నెల కిషోర్ కామెడీ భీష్మ సినిమాకు హైలైట్. త్రివిక్రమ్ రేంజ్‌లో వెంకీ కుడుముల కూడా పంచ్ డైలాగులతో పిచ్చెక్కించాడు. తాజాగా  చిత్రం నుండి తొల‌గించిన స‌న్నివేశాల‌కి సంబంధించిన వీడియో విడుద‌ల చేశారు. మీరు ఆ వీడియోపై ఓ లుక్కేయండి. logo