శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 07, 2020 , 10:54:44

క్వారంటైన్‌లో సీనియర్ ద‌ర్శ‌కుడు..!

క్వారంటైన్‌లో సీనియర్ ద‌ర్శ‌కుడు..!

త‌మిళ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు భార‌తీ రాజా క్వారంటైన్‌లో ఉన్నార‌ని ప‌లు ప‌త్రిక‌లు ప్ర‌చురించ‌డంతో ఆయ‌న దీనిపై స్పందించారు.నేను ఆరోగ్యంగానే ఉన్నాను. క్వారంటైన్‌కి పంపించార‌నే వార్త‌లు అవాస్త‌వం అని పేర్కొన్నారు. నా సోద‌రికి థానేలో శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. ఆమెని చూడ‌డం కోసం పోలీసుల ప‌ర్మీష‌న్ తీసుకొని అక్క‌డికి వెళ్ళాను. వెళ్ళే ముందు చెన్నైలో టెస్ట్‌లు చేయించుకోగా నెగెటివ్ వ‌చ్చింది. థానే అధికారుల‌తో పాటు మ‌ధ్య‌లో కూడా ప‌రీక్ష‌లు జ‌రిపారు. వీట‌న్నింటిలో నెగెటివ్ వ‌చ్చింద‌ని భార‌తీరాజా పేర్కొన్నారు

ఆసుప‌త్రిలో మా సోద‌రిని చూసి డైరెక్ట్‌గా ఇంటికే వ‌చ్చా. జిల్లాలు దాటి వ‌చ్చిన నేప‌థ్యంలో పరీక్ష‌లు చేయించుకున్నా. నేను క్షేమంగా ఉన్నాను. ద‌య చేసి త‌ప్పుడు వార్త‌లు న‌మ్మోదు అంటూ భార‌తీరాజా స్ప‌ష్టం చేశారు.


logo