బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 13, 2020 , 12:27:08

స్వాతి చినుకులు ఫేం భ‌ర‌ద్వాజ్‌కు క‌రోనా..!

స్వాతి చినుకులు ఫేం భ‌ర‌ద్వాజ్‌కు క‌రోనా..!

సినిమాల షూటింగ్ ఇంకా మొద‌లు కాక‌పోయిన‌, సీరియ‌ల్స్ మాత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. క‌రోనా గైడ్‌లైన్స్ పాటిస్తూ అన్ని సీరియ‌ల్స్ సెట్స్ పైకి వెళ్ళాయి. అయితే షూటింగ్ స‌మ‌యంలో కొంద‌రు స్టార్స్ క‌రోనా బారిన ప‌డ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఇప్ప‌టికే నవ్య స్వామి, రవికృష్ణ, ఝాన్సీ, సాక్షి శివ, ప్రభాకర్ వంటి వారు క‌రోనా బారిన ప‌డ‌గా తాజాగా మ‌రో  బుల్లితెర నటుడు భరద్వాజ్ రంగావిజ్జుల కరోనా బారిన పడ్డారు.

స్వాతిచినుకులు, బంధం అనే టీవీ సీరియ‌ల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న భ‌ర‌ద్వాజ్ క‌రోనా బారిన ప‌డ్డ‌ట్టు త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. క‌రోనా ల‌క్ష‌ణాలు త‌న‌కి లేవ‌ని, మంచి డైట్‌తో పాటు మందులు వాడితే ఈ మ‌హ‌మ్మారిని నుండి బ‌య‌ట‌ప‌డొచ్చ‌ని చెప్పుకొచ్చాడు. త‌న‌తో కాంటాక్ట్ అయిన వాళ్ళు టెస్ట్‌లు చేయించుకోవ‌డంతో పాటు క్వారంటైన్‌లో ఉండాల‌ని కోరాడు


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo