ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో పుష్ప ఒకటి. ఆర్య,ఆర్య2 చిత్రాల తర్వాత సుకుమార్-బన్నీ కాంబినేషన్లోఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా పుష్పరాజ్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే బన్నీకి సంబంధించి పలు లుక్స్ విడుదల కాగా, ఇవి కేక పెట్టించాయి.
రెండు పార్ట్‌లుగా విడుదల కానున్న పుష్ప చిత్రంలో మలయాళీ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇటీవల ఆయన కన్నుకు సంబంధించిన పోస్టర్ మాత్రమే విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు ఆయన పవర్ ఫుల్ లుక్ విడుదల చేశారు. ‘విలన్‌ఆఫ్‌పుష్ప’ పేరుతో ఫహద్ ఫస్ట్‌లుక్‌ను షేర్ చేసింది. ఇందులో ఆయన భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ అధికారిగా.. కంటిచూపుతోనే అందర్నీ గజగజ వణికించేలా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
ఫహద్ ఫాజిల్ .. రామ్ చరణ్-శంకర్ సినిమాలోను నటించనున్నట్టు తెలుస్తుంది. ఇందులో విలన్ కోసం నటుడు ఫహద్ ఫాజిల్‌ను శంకర్ టీం సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శంకర్ సినిమాలో హీరోకు బలమైన పోటీగా ప్రతినాయకుడు పాత్ర ఉంటుంది. ఈ మూవీలో కూడా బలమైన క్యారెక్టరైషన్తో విలన్ పాత్ర ఉండబోతుందట. కాగా, పుష్ప చిత్రాన్ని మూత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, ‘పుష్ప ది రైజ్’ పేరుతో మొదటి భాగాన్ని ఈ ఏడాది క్రిస్మస్కు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.