ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 05, 2020 , 21:01:07

లంగావోణిలో అరుళ్ మోహ‌న్ 'భలేగుంది బాలా' సాంగ్ టీజ‌ర్

లంగావోణిలో అరుళ్ మోహ‌న్ 'భలేగుంది బాలా' సాంగ్ టీజ‌ర్

టాలీవుడ్ యాక్ట‌ర్ శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం శ్రీకారం. కిశోర్ బి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా నుంచి భలేగుంది బాలా అంటూ సాగే పాట టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. పెంచ‌ల్ దాస్ రాసి పాడిన ఈ పాట ప‌ల్లెటూరి యాస‌లో సాగుతూ అంద‌రినీ అల‌రించ‌డం ఖాయ‌మ‌ని టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. హీరోయిన్ అరుళ్ మోహ‌న్ లంగావోణీ లో వ‌‌య్యారంగా న‌డుస్తూ ప్రేక్ష‌కులను క‌ట్టిప‌డేస్తుంది. 

శ‌ర్వానంద్‌, ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా సీనియ‌ర్‌ న‌రేష్, స‌త్య‌, ఇత‌ర న‌టీన‌టులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. శ్రీ‌కారం చిత్రానికి మిక్కీ జె. మేయ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు రాస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహ‌న్ న్యాచురల్ నానితో క‌లిసి గ్యాంగ్ లీడ‌ర్ చిత్రంలో మెరిసిన విష‌యం తెలిసిందే.
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.