బుధవారం 03 జూన్ 2020
Cinema - May 12, 2020 , 11:49:45

ర‌వితేజ 'భ‌ద్ర' @ 15

ర‌వితేజ 'భ‌ద్ర' @ 15

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన సినిమా భద్ర. మీరా జాస్మిన్, అర్జన్ బజ్వా, ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాను బోయపాటి శ్రీను తెరకెక్కించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఆపదలో ఉన్న అమ్మాయిని ఆదుకున్న 'భద్ర' అనే యువకుని కథని యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కించారు బోయ‌పాటి.

రాయలసీమలో తన స్నేహితుడి కుటుంబం యొక్క హత్యలకు పగతీర్చుకోవాలననుకునే ఒక యువకుడి కథ నేపథ్యంగా నిర్మితమైన ఈ సినిమా మే 12, 2005న విడుదలైంది. నేటితో ఈ చిత్రం 15 ఏళ్లు పూర్తి చేసుకుంది.  ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి మరిన్ని భాషల్లో పున‌ర్మించ‌బ‌డ‌డం విశేషం. ఈ చిత్రం బోయ‌పాటి శీనుకి తొలి చిత్రం కాగా, ఆయ‌న కూడా నేటితో ద‌ర్శ‌కుడిగా 15 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న‌తో క‌లిసి ప‌ని చేసిన నిర్మాత‌లు, హీరోలు, హీరోయిన్స్‌,  అంద‌రికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.


logo