గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 14, 2020 , 02:51:46

విజయ్‌ పేరుతో తప్పుడు ఆడిషన్స్‌!

విజయ్‌ పేరుతో  తప్పుడు ఆడిషన్స్‌!

అగ్ర కథానాయకుడు విజయ్‌ దేవరకొండతో సినిమా తీస్తున్నామని కొందరు మోసపూరితంగా ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నారని, అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని  విజయ్‌ దేవరకొండ టీమ్‌ పేర్కొంది. ఈ సందర్భంగా వారు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ‘విజయ్‌ దేవరకొండతో కలిసి సినిమా తీస్తున్నట్లు కొన్ని నిర్మాణ సంస్థలు తప్పుడు ప్రకటనలు ఇస్తూ నటీనటులకు ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. విజయ్‌ దేవరకొండతో సంబంధం ఉన్న ఏ ప్రాజెక్ట్‌ గురించి అయినా అధికారిక సమాచారాన్ని ఆయా సినిమాల నిర్మాతలు లేదా విజయ్‌ దేవరకొండ మాత్రమే వెల్లడిస్తారు. విజయ్‌ తన అధికారిక సోషల్‌మీడియా ఖాతాల ద్వారా సమాచారాన్ని పంచుకుంటారు. విజయ్‌ దేవరకొండ పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న వారిపై మేము చర్యలకు సిద్ధమవుతున్నాం. ఇలాంటి తప్పుడు చర్యల పట్ల  అందరూ అప్రమత్తంగా ఉండాలి. సమాచారంలో ప్రామాణికత గురించి జాగ్రత్తగా తరచిచూసుకోవాలని కోరుతున్నాం’ అని విజయ్‌ దేవరకొండ టీమ్‌ స్పష్టం చేసింది.logo