బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 22, 2020 , 01:56:29

అల్లుడు అదుర్స్‌ షురూ

అల్లుడు అదుర్స్‌ షురూ

బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లుడు అదుర్స్‌'.  సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకుడు. సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌  పతాకంపై సుబ్రహ్మణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నభానటేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా చిత్రీకరణ సోమవారం హైదరాబాద్‌లో పునఃప్రారంభమైంది. బెల్లంకొండ శ్రీనివాస్‌, ప్రకాష్‌రాజ్‌లపై కీలక ఘట్టాల్ని చిత్రీకరిస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘కుటుంబ విలువలతో తెరకెక్కుతున్న వినోదభరిత చిత్రమిది. వినూత్నమైన కథాంశంతో రూపొందిస్తున్నాం. ఇటీవల విడుదలైన టైటిల్‌, ఫస్ట్‌లుక్‌కు చక్కటి స్పందన లభిస్తోంది. త్వరలో టీజర్‌ను విడుదలచేస్తాం. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’  అని తెలిపారు. సోనుసూద్‌, వెన్నెల కిశోర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: ఛోటా కె నాయుడు, ఎడిటింగ్‌: తమ్మిరాజు.logo