బాలీవుడ్ స్టార్స్ తమ వైవాహిక బంధాలకు స్వస్థి చెబుతూ తీసుకున్న నిర్ణయాలు అభిమానులకి షాక్ ఇస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన 15 ఏళ్ల వివాహ బంధానికి స్వస్థి పలికి అందరికి షాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు హిందీ నటుడు, నిర్మాత కమల్ సదన 21 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొద్ది రోజులుగా తన భార్య లీసా జాన్‌తో విడిగా ఉంటున్న కమల్ తాజాగా విడిపోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించాడు.
చూసే వారికి ఇద్దరం కలిసి ఉన్నట్టు కనిపిస్తున్న ఒకే దారిలో వెళ్లలేం. ఇలాంటివి చాలా చోట్ల జరుగుతుంటాయి. ఇప్పుడు మాది కూడా అలానే జరిగింది అని చెప్పుకొచ్చాడు కమల్. 2000 జనవరి 1న లీసాని పెళ్లి చేసుకున్నాడు కమల్. వీరికి కొడుకు అంగత్, కూతురు లియా సంతానం ఉన్నారు. లిసా ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి గోవాలో నివసిస్తున్నట్లు సమాచారం. కాగా, 1992లో వచ్చిన ‘బేఖుడి’ సినిమాలో కాజోల్కు జోడీగా నటించిన కమల్ .. ‘విక్టోరియా నెంబర్ 203: డైమండ్స్ ఆర్ ఫరెవర్’ చిత్రంతో నిర్మాతగా మారాడు. అనంతరం 2014లో ‘రోర్’ సినిమాతో దర్శకుడిగానూ అవతారమెత్తాడు.