శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Feb 13, 2020 , 23:34:01

నయన్‌ సినిమాలో సమంత!

నయన్‌ సినిమాలో సమంత!

సవాళ్లతో కూడిన పాత్రలు అనగానే దక్షిణాది చిత్రసీమలో తొలుత గుర్తొచ్చే కథానాయిక నయనతార. ప్రస్తుతం ఆమె బాటలోనే సమంత అడుగులు వేస్తున్నారు. మహిళా ప్రధాన చిత్రాలు, ప్రయోగాత్మక ఇతివృత్తాలతో ఈ కథానాయికలిద్దరూ  విజయాల్ని అందుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం నయనతార, సమంత కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 


‘నానుమ్‌ రౌడీథాన్‌' తర్వాత విజయ్‌సేతుపతి హీరోగా విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్నది. ముక్కోణపు ప్రేమకథతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నయనతార, సమంత కథానాయికలుగా నటించనున్నట్లు చెబుతున్నారు. ‘కాతు వకుల రెండు కాదల్‌' అనే టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలో ఈసినిమా సెట్స్‌పైకిరానున్నట్లు తెలిసింది. logo