శుక్రవారం 10 జూలై 2020
Cinema - May 31, 2020 , 13:50:47

చిరు, చరణ్‌లపై తేనెటీగ‌ల‌ దాడి..!

చిరు, చరణ్‌లపై తేనెటీగ‌ల‌ దాడి..!

లాక్‌డౌన్ వలన ఇన్నాళ్ళు ఇంటికే పరిమితమైన చిరంజీవి, చరణ్‌లు ఉపాసన తాత ఉమాపతి రావు అంత్యక్రియలలో పాల్గొనేందుకు  కామారెడ్డి జిల్లా దోమకొండ గడి కోటకి వెళ్ళారు. అక్కడ ఉమాపతి రావు పార్ధివ దేహాన్ని బయటకి తెస్తున్న క్రమంలో తేనటీగలు ఒక్కసారిగా బయటకి వచ్చాయి . వెంటనే అప్రమత్తం అయిన చిరు, చరణ్‌, ఉపాసనతో పాటు బంధువులు అందరు లోపలకి వెళ్ళారు. దీంతో వారు సురక్షితంగా ఉన్నారు. తేనటీగలు వెళ్లిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. 

కామినేని ఉమాప‌తి రావు(92)  ఉపాసనకి తాతయ్య వరుస కాగా, ఆయన మంగ‌ళ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. వ‌య‌స్సు పైబ‌డ‌డం వ‌ల‌న ఆయ‌న తుదిశ్వాస విడిచిన‌ట్ట తెలుస్తుంది. తెలంగాణ‌లోని దోమ‌కొండ‌లో జ‌న్మించిన ఉమాప‌తి రావు ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా పని చేశారు. నిస్వార్థం, మానవత్వం, హాస్య చతురత ఉన్న ఆయ‌న ఉర్దూలో  రాసిన రచనల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీటీడీ తొలి ఈవోగా పనిచేశారు. అనేక గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు  


logo