e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home సినిమా ముక్కోణపు ప్రేమాయణం

ముక్కోణపు ప్రేమాయణం

ముక్కోణపు ప్రేమాయణం


విరాన్‌ ముత్తంశెట్టి, నిఖిత అరోరా, శృతిశెట్టి నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘బతుకు బస్టాండ్‌’. ఇలవల ఫిల్మ్స్‌ పతాకంపై ఐ. కవితారెడ్డి, కె.మాధవి నిర్మిస్తున్నారు. ఐ.ఎన్‌ రెడ్డి దర్శకుడు. ఈ చిత్ర వీడియో గ్లిమ్స్‌ను సోమవారం చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో కథానాయకుడిని వెతుకుతూ బస్తీలో కొందరు ప్రతినాయకులు తిరుగుతుండటం ఆసక్తిని పంచుతోంది. చివరలో వారిని ఎదురిస్తూ హీరో విరాన్‌ కనిపిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ముక్కోణపు ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రమిది. విరాన్‌ పాత్రచిత్రణ కొత్తగా ఉంటుంది. మాస్‌, క్లాస్‌ అంశాల మేళవింపుతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. జూన్‌ 11న ఈ చిత్రం విడుదలకానుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కు చక్కటి స్పందన లభిస్తోంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వాస్‌ కమల్‌, సంగీతం: మహావీర్‌.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముక్కోణపు ప్రేమాయణం

ట్రెండింగ్‌

Advertisement