టాలీవుడ్ (Tollywood) హీరో నాగార్జున (Nagarjuna) నటిస్తోన్న తాజా చిత్రం బంగార్రాజు (Bangarraju). కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna) దర్శకత్వం వహిస్తున్నాడు. బంగార్రాజు సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. జనవరి 12న విడుదల తేదీని ఫైనల్ చేయగా..దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
బంగార్రాజు చిత్రంలో నాగచైతన్య, కృతిశెట్టి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్నపూర్న స్టూడియోస్, జీస్టూడియోస్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలోని బంగార్రాజు పాత్రకు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
సోగ్గాడే చిన్ని నాయనాలో బంగార్రాజు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూపించగా..తాజా చిత్రంలో బంగార్రాజు చనిపోక ముందు జరిగిన కథను చూపించనున్నాడట కల్యాణ్ కృష్ణ. బంగార్రాజు లో రమ్యకృష్ణ మరోసారి నాగార్జునకు జోడీగా నటిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Manchi Rojulochaie Title Song| సరదాగా ‘మంచి రోజులొచ్చాయి’ టైటిల్ సాంగ్
Ranbir Alia wedding| రణ్‌బీర్‌కపూర్-అలియా పెళ్లిపై తాజా అప్డేట్..!
Pooja Hegde New Look | దీపావళి ఫెస్టివ్ సీజన్ లుక్‌లో పూజాహెగ్డే
Kajal Aggarwal | సమంత, పూజాహెగ్డేను బీట్‌చేసిన కాజల్