గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 12, 2020 , 09:50:50

నా క‌డుపు మీద కొట్టొద్దు.. బండ్ల గ‌ణేష్ విజ్ఞ‌ప్తి

నా క‌డుపు మీద కొట్టొద్దు.. బండ్ల గ‌ణేష్ విజ్ఞ‌ప్తి

క‌మెడీయ‌న్ నుండి బ‌డా నిర్మాత‌గా మారిన బండ్ల గ‌ణేష్ స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే మ‌ధ్య‌లో రాజ‌కీయాల‌లోకి వెళ్ల‌డంతో సినిమాలు చేయ‌డం మానేశారు. కాని త‌న త‌ప్పును తెలుసుకున్న బండ్ల తిరిగి సినిమాలు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. రీసెంట్‌గా ప‌వన్‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 

'నా బాస్ ఓకే చెప్పారు. నా కలలు మరోసారి నిజమయ్యాయి. నా దేవుడు పవన్ కల్యాణ్‌కి ధన్యవాదాలు' అంటూ గణేష్  ట్వీట్ చేయ‌డంతో ఆయ‌న‌కు మెగా అభిమానులు శుభాకాంక్ష‌ల వెల్లువ కురిపించారు. కాగా, తాజాగా ఆయ‌న చేసిన ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  

సోషల్ మీడియాలో తనపై వ‌స్తున్న పుకార్ల‌పై స్పందించిన బండ్ల‌ గణేష్ ..‘ వీపుమీద కొట్టండి .కానీ నీ దయ చేసి కడుపు మీద కొట్టకండి .ఇది నా విన్నపం.నా మీద దయచేసి ఏ విధమైన వార్తలు రాయొద్దు నేను చెప్పే వరకు ఇది నా అభ్యర్థన’ అని ట్వీట్‌ చేశారు. కాగా, కరోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుండి బండ్ల గ‌ణేష్‌లో చాలా మార్పు వ‌చ్చింది. ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌తో అందరిచే శభాష్ అనిపించుకుంటున్నాడు.


logo