మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Aug 14, 2020 , 12:21:15

బండ్ల గ‌ణేష్ ఔదార్యంపై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు

బండ్ల గ‌ణేష్ ఔదార్యంపై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు

న‌టుడిగా, నిర్మాత‌గా తెలుగు ప‌రిశ్ర‌మ‌లో రాణిస్తున్న బండ్ల గ‌ణేష్ కొద్ది రోజుల క్రితం క‌రోనా నుండి కోలుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఇంటికే ప‌రిమిత‌మైన ఆయ‌న సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎవ‌రికైన క‌ష్ట‌మోస్తే తానున్నానే భ‌రోసా క‌ల్పిస్తున్నారు. ట్విట్ట‌ర్ ద్వారా త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ని వెంట‌నే ప‌రిష్క‌రిస్తూ శ‌భాష్ .. బండ్ల అని అనిపించుకుంటున్నారు

ఓ వ్య‌క్తి ఆర్ధిక ఇబ్బందుల కార‌ణంగా కిడ్నీ అమ్మేందుకు సిద్ధం కాగా, ఆయ‌న‌కి తానున్నాన‌నే భ‌రోసా ఇచ్చాడు బండ్ల గ‌ణేష్‌. అలాగే ఇదే రోజున మరో రిపోర్టర్ తనకు కరోనా వచ్చిందని సాయం కోరగా వారికి కాల్ చేసి హెల్ప్ చేస్తా అని గంట వ్యవధిలోనే 2500 వారికి పంపారు. ఎంబీఏ ఫైనాన్స్ చేసిన ఓ వ్య‌క్తి జాబ్ కావాలంటే అత‌డిని ఓ వ్య‌క్తికి రిఫ‌ర్ చేవాడు. ఇలా బండ్ల గ‌ణేష్ కూడా సోనూ సూద్ బాట‌లో ప‌య‌నిస్తూ త‌న ఉదారత చాటుకుంటున్నారు. ఎప్పుడు కాంట్ర‌వ‌ర్సీస్‌తో వార్త‌ల‌లో నిలిచే బండ్ల ఈ సారి మాత్రం సేవా కార్య‌క్ర‌మాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌డం విశేషం.


logo