e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News ప్రభాస్‌, రాజమౌళి పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తుంటే ఆయన్ను నాన్‌లోకల్ అంటారు: బండ్ల‌

ప్రభాస్‌, రాజమౌళి పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తుంటే ఆయన్ను నాన్‌లోకల్ అంటారు: బండ్ల‌

ప్రభాస్‌, రాజమౌళి పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తుంటే ఆయన్ను నాన్‌లోకల్ అంటారు: బండ్ల‌

మ‌రి కొద్ది రోజుల‌లో జ‌ర‌గ‌నున్న మా ఎల‌క్ష‌న్స్‌లో ప్ర‌కాశ్ రాజ్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేయ‌నున్న నేప‌థ్యంలో చాలా మంది ఆయ‌న‌ను నాన్ లోక‌ల్ అని, అత‌ను ఎలా పోటీ చేస్తాడంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ క్ర‌మంలో స్పందించిన ప్ర‌కాశ్ రాజ్ నేను యూనివ‌ర్స‌ల్ న‌టుడిని. నాకు ప్రాంతాల‌తో సంబంధం లేదని అన్నారు.

నాగ‌బాబు మాట్లాడుతూ.. ‘మా’ అసోసియేషన్‌ను ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రకాశ్‌రాజ్‌ ముందుకు వచ్చారన్నాడు. లోకల్, నాన్‌లోకల్ అనేది అర్ధరహిత వాదన . ‘మా’ సభ్యుడు ఎవరైనా ఇక్కడ పోటీ చేయొచ్చని స్పష్టం చేశాడు. ప్రకాశ్‌రాజ్‌కు అందరం మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నామని తెలిపాడు.

- Advertisement -

బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ.. “23 సంవత్సరాల నుంచి ప్రకాశ్‌ రాజ్‌ నాకు ఆప్తులు.ఆయ‌న చేసిన సేవా కార్య‌క్ర‌మాలు క‌ళ్లారా చూశాను. ఎంతో మంది క‌ళాకారుల పిల్ల‌ల పెళ్లిళ్ల‌కు డ‌బ్బులు పంపారు. మంచి వ్య‌క్తి ఆయ‌న‌. ప్రకాశ్‌ రాజ్‌ లోకల్‌, నాన్‌ లోకల్‌ అనడం కరెక్ట్‌ కాదు. “ఇక్కడ పుట్టిన ప్రభాస్‌, రాజమౌళి పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తుంటే ఆయన్ను మాత్రం నాన్‌లోకల్‌ అంటారేంటి? ఒకసారి షాద్‌నగర్‌ చూస్తే ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది? అని బండ్ల గ‌ణేష్ త‌న‌దైన స్టైల్‌లో వ్యాఖ్యానించాడు.

న‌న్ను ఇంట‌ర్వ్యూల‌కు పిల‌వొద్దంటూ కూడా బండ్ల గ‌ణేష్ అన్నారు. ‘మైక్ ఇస్తే బీపీ వస్తుంది, బీపీ వస్తే ఏం మాట్లాడతామో తెలీదు. అప్పుడు అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. అలాంటివి మాకొద్దు. మాది చిన్న కుటుంబం.. మా వెనకాల పెద్ద పెద్దవాళ్లున్నారు అంటూ బండ్ల చాలా లాజిక్స్ మాట్లాడారు.

చదవండి:

Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement