శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 18:02:42

కోడంబాక్కంలోని నివాసానికి బాలు పార్థీవదేహం

కోడంబాక్కంలోని నివాసానికి బాలు పార్థీవదేహం

హైదరాబాద్‌ : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థీవదేహాన్ని చైన్నైలోని కోడంబాక్కంలోని ఆయన నివాసానికి కుటుంబ సభ్యులు తరలించారు. ఎంజీఎం దవాఖాన నుంచి అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. ఆయన మృతి చెందారన్న వార్త తెలుసుకొని పెద్ద సంఖ్యలో అభిమానులు నివాసానికి తరలివచ్చారు. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంతో అభిమానులు ఎవరూ రావొద్దని కుటుంబ సభ్యులు కోరారు. మరో వైపు బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంత్యక్రియలు రేపు చెన్నై సమీపంలోని తామరైపాకంలో ఉన్న ఆయన ఫాంహౌస్ లో జరగనున్నాయి. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.