శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 20:33:46

క‌రోనా టైంలో పాట‌తో సాయం చేసిన ఎస్పీబీ

క‌రోనా టైంలో పాట‌తో సాయం చేసిన ఎస్పీబీ

సంగీత చ‌క్ర‌వ‌ర్తి ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మ‌ర‌ణంతో ప్ర‌పంచం మొత్తం శోక‌సంద్రంలో మునిగింది. మంచి మాన‌వత్వం, క్ష‌మ‌శిక్ష‌ణ‌, ఎంత ఎదిగిన ఒదిగే గుణం ఉన్న బాలుని ఇక చూడ‌లేము, క‌ల‌వ‌లేము అనే వార్త యావ‌త్ భార‌తావ‌నిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. క‌రోనా బారిన ప‌డి క‌న్నుమూసిన బాలు క‌రోనా మ‌హ‌మ్మారి ప్రపంచాన్ని భ‌య‌పెడుతున్న స‌మ‌యంలో సామాన్యుల‌ని భాగం చేస్తూ వినూత్న ప్ర‌య‌త్నం చేశారు.

క‌రోనాతో ఎంద‌రో ప‌రిస్థితి దుర్బ‌రంగా మారింది. చాలా మంది సెల‌బ్రిటీలు త‌మ వంతు సాయం చేశారు. ఈ క్ర‌మంలోనే బాలు కూడా   విపత్కర సమయంలోత‌న‌ వంతు సహాయం చేయాలనుకున్నారు . పోలీస్, పారిశుధ్య, వైద్యులకు సహాయం అందిస్తా. నాతోపాటు శ్రోతలకు కూడా అవకాశం ఇస్తున్నా. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో మీకు నచ్చిన పాట పాడమని నన్ను అడగవచ్చు. ఎవరు ముందు అడుగుతారో వారికే అవకాశం ఉంటుంది.  మీరు కోరిన పాటలు నేను పాడతా. ఇందుకు సాధారణ రుసుము రూ.100 చెల్లించాలి అని బాలు పేర్కొన్నారు.

సేక‌రించిన మొత్తాన్ని ఎలా  వినియోగించాలనే విషయంపై అభిమానుల‌ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటా అని బాలు త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు.  అయితే  మొత్తం పాట పాడితే అరగంటలో ఎక్కువ పాటలు రావు. కాబట్టి పల్లవి, ఒక చరణం మాత్రం పాడతా. అందరూ సహకరించాలని కోరుతున్నా అంటూ బాలు విజ్ఞప్తి చేశారు . ప్ర‌ముఖ లిరిసిస్ట్‌లు అందించిన సాహిత్యంకి త‌న గళాన్ని జోడిస్తూ ప‌లు పాట‌లు ఆల‌పించారు బాలు. తెలుగు, త‌మిళంలో ప‌లు పాట‌లు పాడ‌గా ఇవి శ్రోత‌ల‌ని ఎంత‌గానో అల‌రించాయి. 


logo