ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Sep 28, 2020 , 15:18:15

కూర‌గాయ‌లు అమ్ముతున్న 'బాలికా వ‌ధు' అసిస్టెంట్ డైరెక్ట‌ర్

కూర‌గాయ‌లు అమ్ముతున్న 'బాలికా వ‌ధు' అసిస్టెంట్ డైరెక్ట‌ర్

క‌రోనా మ‌హ‌మ్మారి ధాటికి గ‌త మార్చిలో దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ విధించ‌బ‌డ్డ సంగ‌తి తెలిసిందే. దీంతో సినీ ప‌రిశ్ర‌మ‌తోపాటు అన్ని రంగాలు కుదేలైపోయాయి. క‌రోనా ఎఫెక్ట్ తో చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మలో సినిమాలు,  సీరియ‌ల్స్, టీవీ షో షూటింగ్స్ నిలిచిపోయాయి. ఈ ప‌రిశ్ర‌మ‌ను న‌మ్ముకున్న‌వారు చేసేదేమి లేక పూట గ‌డ‌వ‌డం కోసం ఏదో ఒక ప‌ని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న‌ట్టు ఇప్ప‌టికే చాలా వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా బాలికా వ‌ధు లాంటి పాపుల‌ర్ టీవీ సీరియ‌ల్ కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన రామ్ వృక్ష‌గౌర్ కు పొట్ట‌కూటి కోసం కూర‌గాయ‌లు అమ్ముతూ జీవ‌నం సాగిస్తున్నారు. 

నేను సినిమా చేయాల్సి ఉండ‌గా టైం దొరికింద‌ని  స్వ‌స్థ‌లం అజంఘ‌డ్‌కు వ‌చ్చాను. అయితే నేనిక్క‌డికి రాగానే లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. దీంతో మ‌ళ్లీ వెన‌క్కి తిరిగి వెళ్లే అవ‌కాశం లేకుండా పోయింది. నిర్మాత ఫోన్ చేసి మ‌న ప్రాజెక్టు ను ఆపేశాం. మ‌ళ్లీ షూటింగ్ మొద‌లు పెట్టాలంటే మ‌రో ఏడాది ప‌ట్టొచ్చ‌న్నారు.  దీంతో మా నాన్న కూర‌గాయల వ్యాపారం నేను చేయాల‌ని అప్ప‌డే నిర్ణ‌యించుకున్నా. తోపుడు బండిపై తిరుగుతూ కూర‌గాయలు అమ్ముతున్నా. నాన్న చేసే వ్యాపారం గురించి నాకు తెలుసు అందుకే కూర‌గాయ‌లు అమ్ముతున్నాను. ఇలా కూర‌గాయ‌లు అమ్ముకుంటున్నందుకు నాకు ఎలాంటి బాధ లేదని చెప్పుకొచ్చారు రామ్ వృక్ష గౌర్. ఉపాధి లేద‌ని బాధ‌ప‌డకుండా న‌చ్చిన ప‌ని చేసుకుంటూ వెళ్తున్న రామ్ వృక్ష గౌర్ చాలా మంది స్పూర్తిగా తీసుకోవాల్సిందే. 

రాజ‌స్థాన్ లో చిన్న‌త‌నంలోనే పెళ్లి జ‌రిగిన ఓ బాలిక (ఆనంది)జీవితం చుట్టూ తిరిగే క‌థాంశంతో తెరకెక్కిన బాలికా వ‌ధు సీరియ‌ల్ 2వేల‌కు పైగా ఎపిసోడ్స్ తో గొప్ప ప్ర‌జాద‌ర‌ణ పొందింది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.