గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 22, 2020 , 08:36:21

బాల‌య్య‌కి జోడీగా పాయ‌ల్‌.. రూమర్ అంటున్న మేక‌ర్స్

బాల‌య్య‌కి జోడీగా పాయ‌ల్‌.. రూమర్ అంటున్న మేక‌ర్స్

‘ఆర్‌ఎక్స్‌100’ తర్వాత కెరీర్‌లో సరైన కమర్షియల్‌ సక్సెస్‌ లేకపోయినా చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నది పాయల్‌రాజ్‌పుత్‌.  కొద్ది రోజులుగా  ఆమె బాలకృష్ణతో  జోడీ కట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కాని ఆ వార్త‌ల‌ని కొట్టి పారేస్తున్నారు మేక‌ర్స్. పాయ‌ల్ చిత్రంలోక‌థానాయిక అనేది అవాస్త‌వం అని అంటున్నారు. గ‌తంలో సోనాక్షి సిన్హా క‌థానాయిక అని ప‌లు రూమ‌ర్స్ చ‌క్క‌ర్లు కొట్ట‌గా, దీనిపై స్పందించిన ఆమె త‌న‌ని ఎవ‌రు సంప్ర‌దించ‌లేద‌ని పేర్కొంది.

‘సింహా’, ‘లెజెండ్‌' తర్వాత బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో మరో చిత్రం  తెరకెక్కుతోంది. ఇటీవలే హైదరాబాద్‌లో పూర్తయిన తొలి షెడ్యూల్‌లో బాలకృష్ణపై కీలక ఘట్టాల్ని చిత్రీకరించారు. వార‌ణాశిలోను కీల‌క షెడ్యూల్ పూర్తైన‌ట్టు తెలుస్తుంది. క‌రోనా కార‌ణంగా కొన్నాళ్లు వాయిదా ప‌డ్డ చిత్రం ఎప్పుడు షూటింగ్ జ‌రుపుకుంటుందో తెలియాల్సి ఉంది. కాగా,  ప్రస్తుతం పాయల్‌ రాజ్‌పుత్‌ ‘5డబ్ల్యుఎస్‌' సినిమాతో బిజీగా ఉన్నది. మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె  పోలీస్‌ అధికారిణిగా కనిపించబోతున్నది. 


logo