గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 26, 2020 , 15:12:37

తన విగ్రహాన్ని తయారు చేయించుకున్న బాలసుబ్రహ్మణ్యం

తన విగ్రహాన్ని తయారు చేయించుకున్న బాలసుబ్రహ్మణ్యం

హైదరాబాద్‌ : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంతో ముచ్చటపడి తన విగ్రహాన్ని తయారు చేయించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన వడయార్ రాజ్ కుమార్ అనే శిల్పి బాలు ప్రతిరూపాన్ని తీర్చిదిద్దారు. ముందు బాలు త‌మ త‌ల్లిదండ్రుల తయారు చేయమని రాజ్‌కుమార్‌ను బాలు సంప్రదించారు. గాన గంధర్వుడి కోరిక మేరకు విగ్రహాలను తయారు చేసి ఇచ్చారు. వాటిని చూసి సంబురపడ్డ ఆయన మెసేజ్‌ చేశారు. ‘శుక్రవారం పూట మా అమ్మగారి విగ్రహాన్ని చూపించారు. సంతోషంగా ఉంది. దాన్నెలా పంపిస్తారో నాకు తెలియజేయండి’ అంటూ వాయిస్‌ మెస్సేజ్‌ పంపారు. ఆ తర్వాత ఆయన తన విగ్రహాన్ని తయారు చేయమని కోరారు. తన రికార్డింగ్‌ థియేటర్‌లో విగ్రహాన్ని ఉంచాలని భావించారు. రాజ్‌కుమార్ త‌యారు చేసిన విగ్రహాన్ని చూసి బాగుందని, ఎలాంటి మార్పులు చేయొద్దని ఆడియో మెసేజ్‌ పంపారు. ఎంతో ముచ్చటపడి చేయించుకున్న విగ్రహం పూర్తి కాగా.. చూసుకునేందుకు ఆయన లేకపోవడంపై బాధాకరమని రాజ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బాలుతో పాటు ఆయన తల్లి విగ్రహం ప్రస్తుతం తన వద్దనే ఉన్నాయని రాజ్‌కుమార్‌ తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo