శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 18:35:37

నిర్మాతగా తన దైన ముద్ర వేసిన బాలసుబ్రమణ్యం

 నిర్మాతగా తన దైన ముద్ర వేసిన బాలసుబ్రమణ్యం

హైదరాబాద్ : బాలసుబ్రమణ్యం గాయకుడిగానేకాకుండా తనను పలు కోణాల్లో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగా మెప్పిస్తూనే నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా బహుముఖ ప్రతిభను కనబరిచారు. అంతేకాదు నిర్మాతగా మారి అభిరుచి గల చిత్రాలను నిర్మించారు. కోదండపాణి ఫిల్మ్ సర్క్యూట్స్ బ్యానర్ ను స్థాపించి పలు చిత్రాలను నిర్మించారు.

సినిమా ఇండస్ట్రీలో మొదటిసారి సూపర్ స్టార్ కృష్ణతో కెప్టెన్ కృష్ణ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆ తరువాత బాలకృష్ణ హీరోగా చేసిన ఆదిత్య 369 సినిమాకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పకుడిగా వ్యవహరించారు. ఆ తరువాత కమల్ హాసన్ హీరోగా వచ్చిన శుభసంకల్పం, భామనే సత్యభామనే సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధించాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo