మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 09:08:57

సంక్రాంతి రేసులో బాలయ్య ‘టార్చ్‌బేరర్‌’?

సంక్రాంతి రేసులో బాలయ్య ‘టార్చ్‌బేరర్‌’?

బాల‌కృష్ణ, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో బీబీ3 (వ‌ర్కింగ్ టైటిల్‌) చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సింహా, లెజెండ్‌ వంటి బాక్ల్‌ బస్టర్‌ చిత్రాల తర్వాత ఇద్దరి కాంబినేషన్‌ల వస్తున్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. చిత్రానికి సంబంధించి టీజర్‌ విడుదల చేయగా అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. మిర్యాల రవీందర్‌రెడ్డి సినిమాను నిర్మిస్తుండగా.. ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే మొదటి షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రం షూటింగ్‌ను మిగతా పార్ట్‌ చిత్రీకరణ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఈ నెలాఖరు, అక్టోబర్‌లో షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని మేకర్స్‌ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డేంజర్, సూపర్ మ్యాన్ వంటి టైటిల్స్‌ను పరిశీలించిన తర్వాత మేకర్స్ టార్చ్ బేరర్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. సంక్రాంతి సందర్భంగా 15, జనవరి 2021న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రంలో స్నేహ ప్రధాన పాత్రలో నటించనుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo