టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న ప్రాజెక్టు బీబీ3 (వర్కింగ్ టైటిల్). బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రగ్యాజైశ్వాల్, పూర్ణ ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది.
తాజా షెడ్యూల్ కోసం బాలకృష్ణ అండ్ టీం కర్ణాటకలోని దండేలి అడవులకు వెళ్లిందట. నేటి నుంచి దండేలి అడవుల్లో యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నాడట బోయపాటి. ఏప్రిల్ 3 వరకు కీ షెడ్యూల్ అక్కడే పూర్తి చేయనున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. మే 28న విడుదల కానుంది. ఈ చిత్రానికి మోనార్క్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో భారీగానే అంచనాలున్నాయి.