సోమవారం 06 జూలై 2020
Cinema - Jun 03, 2020 , 13:11:41

ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై బాలయ్య స‌మాధానం

ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై బాలయ్య స‌మాధానం

టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రు నంద‌మూరి ఎన్టీఆర్. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రం చేస్తున్న ఎన్టీఆర్ లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే వెండితెర‌పై త‌న స‌త్తా చాటిన జూనియ‌ర్ రాజ‌కీయాల‌లోను రాణించాల‌ని అభిమానులు కొన్నాళ్ళ నుండి క‌ల‌లు కంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై బాల‌కృష్ణ సానుకూలంగా స్పందించ‌డంతో రానున్న‌రోజుల‌లో ఎన్టీఆర్ రాజ‌కీయాల‌లోకి వ‌స్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.

రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి బాల‌కృష్ణ  ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ’జూనియర్ ఎన్టీఆర్‌లాంటి వ్య‌క్తులు కూడా పూర్తిస్థాయి రాజ‌కీయాల్లోకి వస్తే అటు తెలంగాణ‌, ఇటు ఆంధ్ర‌లో పార్టీకి పూర్వ వైభ‌వం వ‌స్తుంది అనే వాద‌న ఉంది’ అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘అది డేడికేష‌న్‌ను బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది. అదీగాక మీరు ఫుల్ టైమ్ పొలిటిక్స్ అంటున్నారు. త‌న‌కు సినిమా యాక్ట‌ర్‌గా చాలా భవిష్య‌త్తు ఉంది. మ‌రి వాడిష్టం. ప్రొఫెష‌న్ వ‌దులుకుని ర‌మ్మ‌నముగా. ఇప్పుడు నేనున్నాను ఎం.ఎల్‌.ఎగా ఉన్నాను, సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్నాను. నాన్న‌గారు కూడా సీఎంగా ఉన్న‌ప్పుడు సినిమాల్లో యాక్ట్ చేశారు. కాబ‌ట్టి వారి వారి ఇష్టాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది’’ అన్నారు. 

దివంగ‌త‌ ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ కోసం 2009లో ఎన్టీఆర్ జోరుగా ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మ‌ళ్ళీ రాజ‌కీయాల‌పై ఆస‌క్తి చూప‌ని జూనియ‌ర్ సినిమాల‌తో బిజీ బిజీ అయ్యారు. 


logo