మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 19:13:26

'అజ్ఞాత‌వాసం ముగింపు భారం నాపైనే ఉన్న‌ది'..న‌ర్త‌న‌శాల ట్రైల‌ర్

'అజ్ఞాత‌వాసం ముగింపు భారం నాపైనే ఉన్న‌ది'..న‌ర్త‌న‌శాల ట్రైల‌ర్

టాలీవుడ్ యాక్ట‌ర్ నంద‌మూరి బాల‌కృష్ణ 17 నిమిషాల నిడివి ఉన్న న‌ర్తన‌శాల రీమేక్ వీడియోను అక్టోబ‌ర్ 24న విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇవాళ న‌ర్త‌న‌శాల ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. 'ఈ అజ్ఞాత‌వాసం విజ‌య‌వంతంగా ముగియ‌వ‌లెన‌న్న నాపైనే ఎక్కువ బారమున్న‌ది' అంటూ బాల‌కృష్ణ చెబుతున్న సంభాష‌ణ‌లతో మొద‌లైన ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆద్యంతం ఆక‌ట్టుకునే విధంగా సాగుతుంది. ద్రౌప‌ది పాత్ర‌లో సౌంద‌ర్య న‌ట‌న న‌ర్త‌న శాలకు హైలెట్ గా నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

శ్రీహ‌రి, శ‌ర‌త్‌బాబు, ఇత‌ర నటీన‌టులు త‌మ పాత్ర‌ల్లో లీన‌మై పోయి న‌టించారు. న‌ర్త‌న‌శాలలో బాల‌కృష్ణ కీచ‌కుడు, అర్జునుడిగా రెండు పాత్ర‌ల్లో న‌టించ‌గా..సౌంద‌ర్య ద్రౌప‌ది పాత్ర‌లో న‌టించింది. ఇప్ప‌టికే బాల‌కృష్ణ, సౌంద‌ర్య ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్బుత‌మైన స్పంద‌న వ‌స్తోంది.
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.