సోమవారం 06 జూలై 2020
Cinema - Jun 03, 2020 , 13:54:42

నోరు అదుపులో పెట్టుకో, లేదంటే ప‌ళ్ళు రాల‌తాయి

నోరు అదుపులో పెట్టుకో, లేదంటే ప‌ళ్ళు రాల‌తాయి

ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో రెండు ఫ్యామిలీల మ‌ధ్య బిగ్ వార్ జ‌రుగుతున్న‌ట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. రీసెంట్‌గా బాల‌కృష్ణ మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ ప్ర‌భుత్వంతో జ‌రిపిన చ‌ర్చ‌ల‌కి త‌ననెవ్వ‌రు పిలవ‌లేదని చెబుతూ రియ‌ల్ ఎస్టేట్ పదాలని ఉప‌యోగించాడు. దీనిపై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుపై ఫైర్ అయ్యారు. దీంతో ఇటు నంద‌మూరి అభిమానులు మెగా హీరోల‌ని టార్గెట్ చేయ‌డం, మెగా అభిమానులు, నంద‌మూరి హీరోలపై సెటైర్స్ వేయ‌డం జ‌రిగింది.

ఇదే నేప‌థ్యంలో 2011లో రామ్ చ‌ర‌ణ్‌పై బాల‌కృష్ణ ఫైర్ అయిన విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 7 సెన్స్ చిత్ర స‌క్సెస్ మీట్‌కి చ‌ర‌ణ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రు కాగా, ఆ వేడుక‌లో టాలీవుడ్ చిత్ర పరిశ్ర‌మ‌లో మురుగ‌దాస్ లాంటి డైరెక్ట‌ర్స్ లేర‌ని అన్నాడు చ‌ర‌ణ్‌.  ఈ విష‌యం బాల‌కృష్ణ దృష్టికి వెళ్ల‌డంతో ఆయ‌న‌‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు. నోరు అదుపులో పెట్టుకోక‌పోతే ప‌ళ్లు రాల‌తాయి అంటూ నోరు జారాడు. బాల‌య్య వ్యాఖ్య‌ల‌ని ప్ర‌తి ఒక్క‌రు ఖండిస్తున్నారు. 

బాల‌కృష్ణ‌- నాగ‌బాబు మ‌ధ్య జ‌రిగిన మాట‌ల యుద్ధం ఓ వైపు చ‌ర్చ‌నీయాంశంగా మారిన నేప‌థ్యంలో నెటిజన్స్ అప్ప‌టి వ్యాఖ్య‌ల‌ని మ‌ళ్లీ ట్రెండింగ్‌లోకి తెచ్చి మ‌రో వివాదానికి తెర లేపేలా చూస్తున్నారు. మరి ఈ వివాదం ముదురుతుందా లేదంటే ఇక్క‌డికే ముగుస్తుందా అనేది కాల‌మే నిర్ణ‌యిస్తుంది.  కాగా, మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం నంద‌మూరి హీరో ఎన్టీఆర్‌తో క‌లిసి భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 


logo